transform
-
వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!
ఇంగ్లండ్‌కు చెందిన క్రిష్, మిషెల్ అనే దంపతులు పాతబడిన అంబులెన్స్‌ను కొనుక్కుని, దాన్ని చక్కని ఇల్లులా మార్చేశారు. ఇప్పుడు వారు ఈ అంబులెన్స్ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి, ఈ దంపతులు అంబులెన్స్‌ను ఇల్లులా తీర్చిదిద్దుకున్నారు. సామాన్యమైన ఇంటికి కావలసిన వసతులన్నింటినీ ఇందులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంబులెన్స్ 2003 నాటి ‘తాన్యా’ ఈ–450 వాహనం. ఇందులో మంచం, స్టవ్, కిచెన్ కేబినెట్ సహా అవసరమైన సామగ్రిని పొందికగా అమర్చుకున్నారు. స్నానానికి వీలుగా ఫోల్డబుల్ వాటర్ టబ్‌ను కూడా తయారు చేసుకున్నారు. పని పూర్తయ్యాక ఈ టబ్‌ను మడతపెట్టి, దాచేసుకోవచ్చు. వీరు ఈ అంబులెన్స్‌ను అగ్నిమాపక శాఖ నుంచి 4500 పౌండ్లకు (రూ.4.72 లక్షలు) కొనుగోలు చేశారు. కోరుకున్న వసతులతో దీనిని ఇల్లులా మార్చుకోవడానికి మరో 8000 పౌండ్లు (రూ.8.40 లక్షలు) ఖర్చు చేశారు. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురుకి లండన్‌లో ఉద్యోగం) -
నాశనం చేయడం సులభం; సీజేఐ మిశ్రా
న్యూఢిల్లీ: ‘ఓ వ్యవస్థను విమర్శించడం, దానిపై దాడులు చేయడం, నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ వ్యవస్థ పనిచేసేలా మార్చ డం సవాళ్లతో కూడుకున్న కష్టమైన పని’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జస్టిస్ మిశ్రా మాట్లాడారు. వ్యవస్థలోని వ్యక్తులు తమ వ్యక్తిగత కోర్కెలు, లక్ష్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో, హేతుబద్ధతతో, పరిణతి, బాధ్యతలతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టినప్పుడే వ్యవస్థ మరింత ఉన్నత స్థానానికి చేరుతుందని అన్నారు. ‘న్యాయవ్యవస్థను బలహీన పరిచేందుకు కొన్ని శక్తులు పనిచేస్తుండొచ్చు. మనమంతా కలసి వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి’ అని పేర్కొన్నారు. న్యాయ దేవత చేతిలోని త్రాసు సమన్యాయాన్ని సూచిస్తుందనీ, ఆ సమానత్వానికి భంగం కలిగించే ఎవరైనా ఆ దేవతను బాధ పెట్టినట్లేనని జస్టిస్ మిశ్రా అన్నారు. న్యాయ దేవత కన్నీరు కార్చేందుకు తాము ఒప్పుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాహిత వ్యాజ్యాల (పిల్) విస్తృతి దెబ్బతినకుండా ఉండాలంటే కొంత పరిశీలన తప్పనిసరన్నారు. తక్కువ విస్తృతి కలిగిన అంశాలపై పిల్ వేసేందుకు చెల్లించాల్సిన రుసుమును సుప్రీంకోర్టు ఇటీవల భారీగా పెంచడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ తదితర గొప్పవాళ్ల గుర్తుగా ఉన్న ప్రదేశాలను సందర్శించినప్పుడు వారిని పొగడాలని రవి శంకర్ కోరగా, జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ‘వారంతా దేశం కోసం పోరాడారు. మన పొగడ్తల కోసం కాదు’ అని అన్నారు. -
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలి
రామన్నపేట రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని మాజీ ఎంపీపీ నీల దయాకర్, యూత్‌కాంగ్రెస్ రాష్ట్రప్రధానకార్యదర్శి వనం చంద్రశేఖర్ కోరారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సంతకాలను సేకరించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఎ. ప్రమోదినికి వినతిపత్రం సమర్పించారు. రామన్నపేట కేంద్రంగా వలిగొండ, చౌట్పుప్పల్, మోత్కూర్,ఆత్మకూరు మండలాలతో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మినుముల వెంకటరామయ్య, కన్నెబోయిన అయిలయ్య, దొమ్మాటి లింగారెడ్డి, వనం సాయిబాబా, బొడ్డు అల్లయ్య, లవనం ఉపేందర్, సురేష్, ఎండీ జాని, మినుముల సందీప్, కుమారస్వామి, రాజశేఖర్, మోహన్, అశోక్ పాల్గొన్నారు. -
అతను డిస్నీ ‘ప్రిన్సెస్’ అయిపోయాడు!
అమెరికాకు చెందిన 21 ఏళ్ల యువకుడు డిస్నీ ప్రిన్సెస్ కావడానికి అమ్మాయి అవసరం లేదని నిరూపించాడు. స్వయంగా మేకప్ మేన్ అయిన రిచర్డ్ స్కాఫర్ నాలుగేళ్ల పాటు డిస్నీ ప్రిన్సెస్ లా డ్రెస్, మేకప్ చేసుకోవాలనే కలను నిజం చేసుకున్నాడు. డిస్నీ ప్రిన్సెస్ లా వివిధ రకాల్లో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని ఇంటర్ నెట్ ఉంచాడు. అంతే, అవి వైరల్ అయిపోయాయి. ప్రస్తుతం తాను రెండే రెండు గంటల్లో మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకుని ప్రిన్సెస్ లా కనిపిస్తానని చెబుతున్నాడు. చిన్నతనం నుంచి పాఠశాలలో మేకప్ కాంపిటీషన్లలో పాల్గొనేవాడినని తెలిపాడు. ఈ ఫోటోలనే గనక డిస్నీ సంస్థ దృష్టిలో పడితే రిచర్డ్ రొట్టే విరిగి నేతిలో పడ్డట్టే..! -
జిసిఎస్లో పేలిన ట్రాన్స్ఫార్మర్