రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలి
రామన్నపేట
రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని మాజీ ఎంపీపీ నీల దయాకర్, యూత్‌కాంగ్రెస్ రాష్ట్రప్రధానకార్యదర్శి వనం చంద్రశేఖర్ కోరారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సంతకాలను సేకరించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఎ. ప్రమోదినికి వినతిపత్రం సమర్పించారు. రామన్నపేట కేంద్రంగా వలిగొండ, చౌట్పుప్పల్, మోత్కూర్,ఆత్మకూరు మండలాలతో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మినుముల వెంకటరామయ్య, కన్నెబోయిన అయిలయ్య, దొమ్మాటి లింగారెడ్డి, వనం సాయిబాబా, బొడ్డు అల్లయ్య, లవనం ఉపేందర్, సురేష్, ఎండీ జాని, మినుముల సందీప్, కుమారస్వామి, రాజశేఖర్, మోహన్, అశోక్ పాల్గొన్నారు.