న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా నుంచి 73 వేల రైఫిళ్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కొనుగోలుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారని అధికారులు వెల్లడించారు. సిగ్ సూయేర్ అని పిలవబడే ఈ రైఫిళ్లను 3,600 కిలోమీటర్లు ఉన్న చైనా సరిహద్దు ప్రాంతంలోని భద్రతా బలగాలకు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. రైఫిళ్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం వారంలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఒప్పందం పూర్తయిన సంవత్సరంలో రైఫిళ్లను డెలివరీ చేస్తారని సంబంధిత అధికారులు వివరించారు. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment