rifles
-
Jammu Kashmir: ఉగ్రవాదులను తరిమికొడుతున్న గ్రామీణులు
జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో తరచూ ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అటు భద్రతా బలగాలు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఉగ్రవాదులను తరిమికొట్టే పనిలో పడ్డారు.జమ్ముకశ్మీర్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో పోరాడేందుకు విలేజ్ సెక్యూరిటీ గ్రూప్ (వీడీజీ) సభ్యులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు ఆధునిక ఆయుధాలు అందజేస్తున్నారు. గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లను పోలీసులు ఇస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించినపక్షంలో వారికి గ్రామస్తులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీడీజీ సభ్యులతో పాటు మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారికి ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను అందజేస్తున్నారు.ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడేందుకు మానసికంగా సిద్ధమయ్యేలా గ్రామస్తుల్లో ధైర్యం, మనోధైర్యాన్ని వీడీజీ సభ్యులు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ధార్ సక్రికి చెందిన చైన్ సింగ్, జస్వంత్ సింగ్, గబ్బర్, రొమేష్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ గ్రామాల్లోని పలువురిని చంపేశారన్నారు. ఆ తర్వాత గ్రామ భద్రతా కమిటీలు తమకు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ అందజేశాయన్నారు. -
గన్స్ & కార్స్
సాక్షి, హైదరాబాద్: సొంతకారు కూడా లేని సీఎం కేసీఆర్, మంత్రులు మల్లారెడ్డి, సబిత, ఎమ్మెల్యేదానం నాగేందర్ వంటి వారు ఒకవైపు... లగ్జరీ కార్లు, అత్యాధునిక ఆయుధాలున్న హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అక్బరుద్దీన్, శ్రీలతారెడ్డి వంటి అభ్యర్థులు మరోవైపు. ఆత్మరక్షణ కోసమో, ఫ్యాషనో, వారసత్వమో కారణమేదైనా పలువురు రాజకీయ నాయకుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు .22 పిస్టల్ వారసత్వంగా రాగా.. యాకుత్‌పుర బరిలో ఉన్న జాఫర్ అమెరికా కంపెనీ నుంచి తుపాకులు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కారులో చక్కర్లు కొడుతుండగా.. హుజూర్నగర్ బరిలో ఉన్న శ్రీలతారెడ్డికి 1.38 కోట్ల ఖరీదైన ఐదు లగ్జరీ కార్లున్నాయి. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి టెక్సాస్ నుంచి టెస్లా, ల్యాండ్ రోవర్ కార్లు దిగుమతి చేసుకున్నారు. వీరంతా ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచారు. విదేశాల నుంచి గన్స్ దిగుమతి.. యాకుత్‌పుర నుంచి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్ మిరాజ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ స్మిత్, వెస్సన్ బ్రాండ్ తుపాకులు కొనుగోలు చేశారు. రూ.2 లక్షలు ఖరీదైన 32 బోర్ రివాల్వర్, .32 పిస్టల్ రాఫ్టర్ ఈయన వద్ద ఉన్నాయి. రూ.19.50 లక్షల విలువైన ఆడి క్యూ3 కార్ కూడా ఉంది. మలక్‌పేట అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల వద్ద రూ.లక్ష విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన 12 బోర్ గన్లు ఉన్నాయి. బలాలకు రూ.26.69 లక్షలు ఖరీదైన ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ వాహనాలున్నాయి. బలాలకు షహనాజ్ సుల్తానా, తాహేరా ఫర్హా, సనా సుమేరా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరి పేర్ల మీద రూ.59 లక్షలు విలువ చేసే హోండా బీఆర్వీ, టొయోటా ఫార్చ్యూనర్ కార్లున్నాయి. హరీశ్ వర్సెస్ రేవంత్.. రాజకీయ క్షేత్రంలోనే కాదు ఆయు« దాల విషయంలోనూ హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశరావుకు రూ.1.30 లక్షలు విలువ చేసే .32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వద్ద రూ.2 లక్షలు విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన రైఫిల్ ఉన్నాయి. రేవంత్ పేరు మీద సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్‌తో పాటు హోండా సిటీ కార్లు కూడా ఉన్నాయి. ఎస్బీబీఎల్ పంప్ యాక్షన్ గన్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద రూ.లక్ష విలువ చేసే రివాల్వర్, రూ.60 వేలు విలువ చేసే 12 బోర్ సింగిల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (ఎస్బీబీఎల్) పంప్ యాక్షన్ గన్ ఉంది. ఆయన భార్య శారద పేరు మీద వోల్వో ఎక్స్‌సీ 90 కారు ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ కారు విలువ రూ.71.82 లక్షలు. ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి వద్ద రూ.1.50 లక్షలు విలువ చేసే రివాల్వర్‌తోపాటు రూ.70.82 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ 530డీ స్పోర్ట్ లగ్జరీ కారు, రూ.34.92 లక్షల ఖరీదైన ఫార్చ్యూనర్ ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీ నుంచి.. గతంలో హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆయుధాలు, కార్లున్నాయి. ప్రధానంగా కుటుంబ సెంటిమెంట్‌గా భావించే .22 పిస్టల్ ఉంది. దీని విలువ రూ.20 వేలు. దీంతో పాటు వేట కోసం వినియోగించే 30–06 స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్ ఉంది. దీన్ని 1996లో రూ.20 వేలతో కొనుగోలు చేశారు. 2016లో రూ.11,450తో కొనుగోలు చేసిన 12 బోర్ డబుల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (డీబీబీఎల్) గన్ కూడా ఉంది. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుంచి బహుమతిగా వచ్చిన జీపు కారు కూడా ఉంది. దీంతో పాటు 2007లో జిప్సీ కారు, 2005లో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన డ్యుకాటీ 900 ఎస్ఎస్ మోటార్ సైకిల్స్ కూడా అక్బరుద్దీన్ పేరు మీద ఉన్నాయి. ఈయన భార్య సాబీనా ఫర్జానా పేరు మీద మహీంద్రా స్కార్పియో వీఎల్ఎక్స్ వాహనం ఉంది. దీని విలువ రూ.12.95 లక్షలు. స్పోర్ట్స్ కారులో అజార్, టెస్లాలో శ్రీలత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వద్ద రూ.71.89 లక్షలు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ.28 లక్షలు విలువైన హోండా సీఆర్–వీ కార్లున్నాయి. హుజూర్నగర్ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.1.38 కోట్ల విలువ చేసే ఐదు లగ్జరీ కార్లున్నాయి. రూ.62.63 లక్షల విలువ చేసే టెస్లా కారుతో సహా రూ.29.15 లక్షల హ్యుందాయ్ టక్సన్, రూ.36 లక్షల ఖరీదైన ఇన్నోవా క్రిస్టా, వెంటోతో పాటు రూ.11 లక్షల విలువైన మారుతీ బాలెనో కార్లున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి వద్ద 2021 మోడల్ టెస్లా కారు ఉంది. దీని విలువ రూ.51.75 లక్షలు. రూ.18.16 లక్షల విలువైన 2016 మోడల్ ల్యాండ్ రోవర్ వాహనం కూడా ఉంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. -
సర్దుకుపోతేనే మణిపూర్‌లో శాంతి!
నెలన్నరగా మణిపూర్ మండుతూనే ఉంది. తీవ్రత తగ్గినప్పటికీ హింసాత్మక ఘటనలు పూర్తిగా ఆగిపోలేదు. ఇప్పటివరకూ సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది సహాయ శిబిరాల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అటు మైతైలతో పాటు ఇటు కుకీలు కూడా ప్రభుత్వ బలగాలు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండటం. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితిపై ఉన్న సాధారణ అంచనా ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాల్లో దిక్కుతోచడం లేదు. కేంద్రానికి నిబద్ధత కరవైంది! ప్రస్తుత సంక్షోభం మణిపూర్‌లోని తెగల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను మరోసారి ప్రపంచానికి ఎత్తి చూపుతోంది. మణిపూర్‌లో చీకటి రోజులు నడుస్తు న్నాయి. నెలన్నరగా రెండు ప్రధాన తెగలైన మైతై, కుకీల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న సూచనలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. మొదలైనప్పటి స్థాయిలో కాకపోయినా అక్కడక్కడా రెండు తెగలకు చెందిన గ్రామాలున్న చోట హింస చోటు చేసుకుంటోంది. ఒకప్పుడు ఆప్తమిత్రుల్లా ఉన్న ఈ తెగలిప్పుడు బద్ధశత్రువుల్లా మారిపోయాయి. మణిపూర్‌లో ఘర్షణలు మొదలైన తరువాత ఇప్పటివరకూ సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది రిలీఫ్ క్యాంపుల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాంతి సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న భావన ఏర్పడటంతో... క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న వారిలో నిస్పృహ పెరిగిపోతోంది. ఇప్పుడిది ఆగ్రహంగా పరిణమించి మరిన్ని హింసాత్మక ఘటనలకూ, ఘర్షణ లకూ దారితీసే అవకాశం ఏర్పడుతోంది. ఈ ఆగ్రహం అధికారంలో ఉన్న వారిపైకి మళ్లినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితిపై ఉన్న సాధారణ అంచనా ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాల్లో దిక్కుతోచడం లేదు. కేంద్రానికి నిబద్ధత కరవైంది! ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అటు మైతైలతో పాటు ఇటు కుకీలు కూడా ప్రభుత్వ బలగాలు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండటం. రాష్ట్ర ప్రభుత్వ పోలీసు కాని స్టేబుళ్లు, సాయుధ మణిపూర్ రైఫిల్స్ బలగాలు మైతైలకు అనుకూ లంగా పనిచేస్తున్నాయని అనుకుంటూంటే... కేంద్ర పారామిలటరీ బలగాలు, ముఖ్యంగా అస్సామ్ రైఫిల్స్ కుకీలకు వత్తాసు పలుకు తున్నాయని భావిస్తున్నారు. వాస్తవానికి జూన్ రెండున జరిగిన ఘర్షణలు పూర్తిగా నివారించదగ్గవి. మణిపూర్ పోలీస్ కమాండోలు, అసాం రైఫిల్స్‌కు చెందిన ఒక యూనిట్ మధ్య జరిగిన ఈ ఘర్షణ దాదాపుగా కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో అస్సా రైఫిల్స్‌కు చెందిన ఒక బృందం రెచ్చగొట్టే విధంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కార్యాలయ దారిని మూసేసింది. గేట్ దగ్గర ఇద్దరు సాయుధ సిబ్బందిని నియమించింది. పరిస్థితి చేయిదాటే సమయానికి ఈబృందం వెనక్కు తగ్గింది. ఈ ఘటన మొత్తం ఒక వ్యక్తి తాలూకూ అసూయ కావచ్చు లేదా ఇంకేదైనా స్థానిక కారణం కావచ్చు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ పర్యటన జరిగిన రెండు రోజుల తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అమిత్ షా హామీ ఇచ్చిన విధంగానే గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు కావడం స్వాగతించాల్సిన విషయం. మణిపూర్ సంక్షోభానికి కారణాలను కనుక్కోవడం, ఎవరి బాధ్యత ఏమిటో తేల్చడం ఈ కమిటీ ఉద్దేశం. అయితే రాష్ట్ర గవర్నర్ అన సూయ యుకీ నేతృత్వంలో 51 మందితో ఒక శాంతి కమిటీ ఏర్పాటు చేసే ప్రయత్నం మాత్రం అందరూ ఊహించినట్టుగానే బాలారి ష్టాలను ఎదుర్కొంటోంది. కమిటీ కోసం ఎంపిక చేసినవారు క్రమంగా విరమించుకుంటున్నారు. రాజకీయ ప్రమేయం ఉన్నవారు ఎక్కువవు తున్నందుకే విరమించుకుంటున్నట్లు చెబుతున్నారు. కమిటీలోని కుకీ సభ్యులు ముఖ్యమంత్రి ఎన్ . బీరేన్ సింగ్ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభానికి ఆయనే సూత్రధారి అనీ, ఆయన కుకీ వ్యతిరేకి అనీ వారి వాదన. ఇంకో విషయం... కమిటీలో ముఖ్యమంత్రిని చేర్చడం ద్వారా ఆయన్ని పదవి నుంచి తప్పించే ఉద్దేశమేమీ తమకు లేదని కేంద్రం చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలూ లేవని తేలిపోయింది. రాష్ట్రంలోని చాలామంది ఈ రెండింటిలో ఏదో ఒకటి సంభవమన్న అంచనాలో ఉండటం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రం కావడం వల్లనే ఇవి ఏవీ జరగడం లేదేమో! ప్రస్తుత సంక్షోభం మణిపూర్‌లోని ఆదిమ తెగల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను మరోసారి ఎత్తి చూపుతోంది. ఇది కేవలం తెగల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు మాత్రమే అనుకునేందుకు లేదు. కొండలు, లోయల్లో నివసించే వారి మధ్య ఘర్షణలుగానూ చూడవచ్చు. ఈ విషయంలో నాగాలు, కుకీలు ఒక వైపున ఉంటే మైతైలు ఇంకోవైపున ఉన్నారు. మణిపూర్ మొత్తమ్మీద 90 శాతం పర్వత ప్రాంతమే. షెడ్యూల్డ్ తెగల కోసం ప్రత్యేకమైన ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. లోయ ప్రాంతాలు రాష్ట్ర భూభా గంలో పది శాతం. గిరిజన తెగలకు చెందని మైతైల నివాస ప్రాంతాలు ఇవే. ఇటీవలి కాలంలో మైతైల్లో అధికశాతం మంది తమకూ షెడ్యూల్డ్ తెగల గుర్తింపు కాంక్షిస్తున్నారు. నాగాలు, కుకీలు దీన్ని వ్యతిరేకిస్తు న్నారు. ఈ వ్యతిరేకత వల్లనే పరిస్థితి ఈ స్థాయికి చేరింది అనేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మైతైల డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ మే 3న నిర్వహించిన ర్యాలీలో నాగాలు తమ సంబంధాల హద్దులను దాటలేదు. కుకీలు మాత్రం చురాచంద్రపూర్ జిల్లాలో మైతైలున్న ప్రాంతాలపై దాడులు చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. కుకీ యుద్ధ స్మారకం ఒక దాన్ని మైతైలు తగలబెట్టేశారన్న వదంతులతో ఈ విధ్వంసం జరగడం గమనార్హం. మైతైలపై కలిసి యుద్ధం చేద్దామని కుకీలు కొన్ని సంకేతాలు పంపినా నాగాలు ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నారు. ఈ తటస్థ వైఖరితోనూ కొన్ని చిక్కులున్నాయి. జూన్ 9న రాష్ట్రానికి చెందిన పది మంది నాగా ఎమ్మెల్యేలు సంప్రదింపుల కోసం అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తమ వంతు సాయం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే కుకీల కోసం ప్రత్యేక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. దీనికోసం నాగాల భూముల జోలికి మాత్రం రావద్దని వీరు ప్రతిపాదించారు. మణిపూర్‌లోని పర్వతప్రాంత జిల్లాల్లో మొత్తంగా కుకీ గ్రామాలు విస్తరించి ఉన్నాయి. నాగాలు కూడా చురాచంద్రపూర్ మినహా మిగిలిన పర్వతప్రాంత జిల్లాలు తమ మూల నివాసంగా భావిస్తారు. అంటే ఆచరణలో కుకీల డిమాండ్ ఏమాత్రం ఆమోదయోగ్యం కానిది అవుతుంది. 1990లో యునైటెడ్ నాగా కౌన్సిల్ కుకీ గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. నాగాల దృష్టిలో కుకీలు తమ గ్రామాల్లో ఉంటున్న కిరాయిదారులు. ఈ తీర్మానం చివరకు ఘర్షణ లకు దారి తీయడమే కాకుండా, 800 మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది. తటస్థ వైఖరి అనేది హెర్బెర్ట్ బి.స్వోప్ కథనం ఒకదాన్ని గుర్తు చేస్తోంది. పులిట్జర్ ప్రైజ్ అవార్డు పొందిన కొన్ని కథనాలను స్వోప్ జర్మనీ నుంచి రాసేవారు. ‘న్యూయార్క్ వరల్డ్’లో ప్రచురితమ య్యాయి. ఆ కాలంలో అమెరికన్లు తటస్థ వైఖరి ప్రకటించడంపై జర్మన్లు గుర్రుగా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొనేందుకు ఏడాది ముందు ముచ్చట ఇది. అమెరికన్ల తటస్థత జర్మన్ల విషయంలో మెదడు సంబంధి అనీ, మిత్రపక్షాలతో వర్తన మాత్రం హృదయ సంబంధి అనీ జర్మన్లు భావించేవారు. నాగాల పరిస్థితి అలాగే ఉంది. కుకీల పక్షం వహించబోమని చెబుతూనే, మైతైలతో తమకు భేదాభిప్రాయాలు లేవని అనుకోవద్దంటున్నారు. ప్రస్తుతం మణిపూర్ ప్రజల ముందున్న సవాలు ఏమిటంటే... ఘర్షణ పూరిత వాతావరణం తొలగిపోయిన వెంటనే, పరిపాలన వ్యవస్థ నిర్మాణంలో ఏకాభిప్రాయానికి కృషి చేయడం. అప్పుడే దాదాపు 34 భాషాపరమైన సమూహాలున్న మణిపూర్‌లో శాంతి స్థాపన సాధ్యమ వుతుంది. పరస్పరం సహకరించుకోవడం, సర్దుకుపోవడం, ఉమ్మడి విధిని అంగీకరించడం ఇప్పుడు జరగాల్సిన పనులు! ప్రదీప్ ఫన్ జౌబమ్ వ్యాసకర్త ‘ఇంఫాల్ ఫ్రీ ప్రెస్’ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత
భారత సైన్యం, జమ్ముకాశ్మీర్ పోలీసులు భారీ మొత్తంలో యుద్ధం తరహా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరీలోని హత్లాంగా సెక్టార్లో ఈ ఆయుధాలను గుర్తించారు. ఆ ఆయుధాల్లో ఎనిమిది ఏకేఎస్ 74 రైఫిళ్లు, 560 లైవ్ రైఫిల్ రౌండ్లు, 12 చైనీస్ పిస్టల్స్, 14 పాకిస్తాన్, చైనా గ్రెనేడ్లతో పాటు పాకిస్తాన్ జెండాతో కూడిన బెలూన్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కల్నల్ మనీష్ పంజ్ చెప్పారు. ఆ ఆయుధాలు పాకిస్తాన్‌వేనని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు కల్నల్ మనీష్ పంజ్ పాకిస్తాన్‌కి చెందిన మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసును చేధించే క్రమంలోనే ఒక రాజకీయ కార్యకర్త, కాంట్రాక్టర్, దుకాణాదారుడు, ఐదుగురు పోలీసులతో సహా సుమారు 17 మందిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో పౌల్ట్రీ షాపు యజమాని మహ్మద్ వసీమ్ నజర్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతడిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు తెలిపారు. (చదవండి:15 రోజుల పాటు శిక్ష..ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ) -
ఏకే–203 రైఫిళ్ల తయారీ అమేథీలో
న్యూఢిల్లీ: అత్యాధునిక ఏకే–203 రకం రైఫిళ్లను భారత్‌లో తయారుచేసేందుకు మార్గం సుగమం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలోని కోర్వాలో రైఫిళ్లను తయారుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మనిర్భర్ సాధించడానికి తాజా నిర్ణయం బాటలుపరుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.5వేలకోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు లక్షలకుపైగా రైఫిళ్లను అక్కడ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు. ‘ ఈ కొత్త ప్రాజెక్టు కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలు మెరుగుపడతాయి’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు దశాబ్దాల క్రితం నుంచి భారత సాయుధ బలగాల కోసం వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ అధునాతన ఏకే–203 రైఫిళ్లను తెచ్చారు. ఈ తేలికైన 7.62 ్ఠ 39 మిల్లీమీటర్ల కాలిబర్ రైఫిల్ 300 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేధించగలదు. ఈ నెల ఆరున రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముంది. చాలా సంవత్సరాల క్రితమే ఈ ఒప్పందంపై రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, రైఫిళ్ల సాంకేతికత రష్యా నుంచి భారత్‌కు బదిలీచేసే అంశం కొలిక్కి రాలేదు. ఇంతకాలానికి ఇది సాధ్యమైంది. పుతిన్ పర్యటనలో పలు ఒప్పందాలు.. సోమవారం ఢిల్లీకి రానున్న పుతిన్ సమక్షంలో భారత్ రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంథనం, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సోమవారం సాయంత్రం 5.30గంటలకు కీలక వ్యూహాత్మక అంశాలపై మోదీ, పుతిన్ చర్చించనున్నారు. ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 భేటీల్లో తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తత, తాలిబాన్ పాలనలో అఫ్గాన్ నుంచి భారత్‌కు పెరగనున్న ఉగ్ర ముప్పు అంశాలూ చర్చించనున్నారు. రెండు ఇంజన్ల కమోవ్–226టీ తేలికపాటి 200 హెలికాప్టర్ల సంయుక్త తయారీ అంశం ఓ కొలిక్కిరానుంది. వచ్చే మూడేళ్లలో ఇరుదేశాల పెట్టుబడుల ఒప్పందాలు 50బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంపైనా దృష్టిపెట్టనున్నారు. -
ఏకే203 @ అమేథి
అమేథి అనగానే ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట గుర్తుకొస్తుంది ఎవరికైనా! ఆఫ్కోర్స్ ఇప్పుడు కాదనుకోండి... కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీ అక్కడ ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమేథి రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది. అమేథిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా 6 లక్షల ఏకే203 అసల్ట్ రైఫిల్స్‌ను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ మంగళవారం పచ్చజెండా ఊపింది. భారత సాయుధ బలగాలు ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చేనెల ఆరో తేదీన భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్– రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. భారత్ నినాదమైన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇరుదేశాల సంయుక్త భాగస్వామ్యంలో ఏకే203 రైఫిల్స్ ఉత్పత్తి జరుగుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్‌కు సంబంధించినంత వరకు రష్యా తయారీ విడిభాగాలను వాడతారు. తర్వాత ఇరుదేశాల మధ్య ఈ రైఫిల్స్ తయారీకి సంబంధించి సాంకేతికత బదిలీ పూర్తయి... భారత్‌లోనే తయారైన విడిభాగాలతో ఉత్పత్తి మొదలవుతుంది. మొదటి 70 వేల రైఫిల్స్ వచ్చే ఏడాది భారత సైనిక బలగాలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం రూ. 5,000 కోట్ల విలువైన ఒప్పందానికి మంగళవారం డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ (డీఏసీ) తుది ఆమోదముద్ర వేసిందని రక్షణవర్గాల విశ్వసనీయ సమాచారం. ఐఏఎఫ్‌కు జీశాట్–7సీ శాటిలైట్ భారత వాయుసేనకు జీశాట్– 7సీ శాటిలైట్, దాని సంబంధిత ఉపకరణాల కొనుగోలు నిమిత్తం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. రూ.2,236 కోట్ల నిధులను ఇందుకోసం కేటాయించింది. భారత వాయుసేన సాంకేతిక, సమాచార వ్యవస్థల ఆధునికీరణకు సంబంధించిన అవసరాల కోసం ‘మేకిన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు రక్షణశాఖ వెల్లడించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత సైనికుల చేతికి అత్యాధునిక AK 200 రైఫిల్స్
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు భారత ఆయుధ రంగంలో కనీవిని ఎరుగని రీతిలో కొత్త ఆయుధాలను తయారు చేసి భారత ఆర్మీకి అందుబాటులోకి తీసుకు వస్తుంది. తాజాగా 70 వేల ఏకే 200 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ సైన్యానికి అందించదనం కోసం భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 7 లక్షల ఏకే-203 రైఫిల్స్ ను సంయుక్తంగా తయారు చేయడానికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఆ ఒప్పందం 2018 నుంచి ఇప్పటికీ పెండింగ్ లో ఉంది.(చదవండి: వాయుసేనకు అందుబాటులో అధునాతన చాఫ్ టెక్నాలజీ) రక్షణ & భద్రతా వ్యవస్థ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 7.62×39 మి.మీ ఏకే-203 రైఫిల్ లో 20,000ను నేరుగా దిగుమతి చేసుకుని, మిగిలిన వాటిలో 6.5 లక్షలను మన దేశంలో సంయుక్తంగా తయారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఒకవేల ఉమ్మడి ఉత్పత్తి సమయంలో ఆలస్యం అయితే వాటిలో ఎక్కువ వాటిని షెల్ఫ్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆఫ్-ది-షెల్ఫ్ ఎక్విప్ మెంట్ లో ఏకే 200 సిరీస్ లో చాలా వేరియెంట్స్ ఉండవచ్చు. రైఫిల్ తయారీ సంస్థ అయిన ఇండో-రష్యా రైఫిల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన అధికారుల సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ రైఫిళ్లను ఈ ఏడాది నవంబర్ నుంచి సైనికులకు అంధించనున్నారు. ప్రస్తుతం సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో వినియోగిస్తున్న 5.56×45 మి.మీ ఐ.ఎస్.ఎ.ఎస్ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్స్ స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు. భారత సాయుధ దళాలు 7.62×51 మి.మీ అమెరికన్ సీజీ 716 రైఫిళ్లను కూడా ఉపయోగిస్తున్నాయి. వీటిని ఫ్రంట్ లైన్ పదాతి దళ సైనికులు వినియోగిస్తారు. మిగిలిన వారు ఏకే-203ను ఉపయోగిస్తారు. -
భారత్‌లోనే ఏకే–47 తయారీ!
మాస్కో: భారత్‌లో ఏకే– 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ డీల్ కొలిక్కి వచ్చినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేవీలో భాగంగా వీటిని ఉత్పత్తి చేస్తారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, కల్నోషికోవ్ కన్సెర్న్, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌లు ఈ జాయింట్ వెంచర్(జేవీ)లో భాగస్వాములు. జేవీలో ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ(50.5 శాతం)వాటా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే– 47లను ఉత్పత్తి చేయనున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి. డీల్ విశేషాలు... ► ఏకే– 47 రైఫిల్స్‌లో 203 మోడల్ ఆధునికమైన వెర్షన్. ►ప్రస్తుతం ఆర్మీ వాడుతున్న ఇన్సాస్ 5.56 ్ఠ45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే– 47 –203 7.62ణ39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు. ► భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే– 47 203లు అవసరం పడతాయని అంచనా. ► లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. ► ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు ఉండవచ్చు. ► ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు. ► ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. ► అందుకే ఆర్మీకి ఏకే– 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు. రష్యా రక్షణమంత్రితో రాజ్నా«థ్ చర్చలు రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, మందుగుండు, విడిభాగాలను భారత్‌కు సరఫరా చేసే అంశంపై రష్యాతో చర్చలు జరిపారు. ఎస్400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను సకాలంలో భారత్‌కు అందించాలని రాజ్‌నాథ్ కోరినట్లు అధికారులు తెలిపారు. 2021 చివరకు ఈ మిసైల్ వ్యవస్థ తొలిబ్యాచ్ భారత్‌కు చేరవచ్చని అంచనా. శుక్రవారం రాజ్‌నాథ్ ఎస్సీఓ సమావేశంలో పాల్గొంటారు. -
సరిహద్దు పహారాలో ఉమెన్ రైఫిల్స్
భారత్ పాక్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా పురుషుల పహారానే ఉంది. కాని చరిత్రలో మొదటిసారి ఆరుగురు మహిళలు అక్కడ కావలికి తుపాకీ పట్టారు. సముద్రమట్టానికి 10 వేల అడుగుల ఎత్తున విధులు నిర్వర్తిస్తున్న ఉమెన్ రైఫిల్స్ మన సైన్యానికి కొత్త డేగకళ్లు అయ్యారు. పాకిస్తాన్–భారత్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ సమీపంలో ఉండే కీలకమైన గస్తీ పాయింట్ ‘సాధనా టాప్’. సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉండే ఈ పాయింట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు అత్యంత సమీపం. పి.ఓ.కె నుంచి పాక్ దన్ను ఉన్న ఉగ్రవాదులు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు, డ్రగ్స్ ఈ పాయింట్ నుంచే కాశ్మీర్‌లోకి అడుగుపెడతాయి. దశాబ్దాలుగా ఇక్కడ భారత సైనికులు పహారా కాస్తుంటారు. అయితే ఇన్నాళ్లు పురుష సైనికులు మాత్రమే పహారా కాశారు. చరిత్రలో మొదటిసారి ఇక్కడ 30 మంది మహిళలు గస్తీకి నియుక్తులు కావడం విశేషం. ఉమెన్ రైఫిల్స్ దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్న పారామిలటరీ దళం అస్సాం రైఫిల్స్. దీనికి మహిళా విభాగం కూడా ఉంది. ఆ విభాగం నుంచి 30 మంది మహిళా సైనికులను డిప్యుటేషన్ మీద సైన్యంలోకి తీసుకుని వాస్తవాధీన రేఖ వద్ద గస్తీకి పెట్టారు సైనికాధికారులు. ఆ మహిళా సైనికాధికారి పర్యవేక్షణలో పని చేసే ఈ ఆరుమంది మగసైనికులతో పాటుగా విధులు నిర్వర్తించాలి. గ్రామీణుల కోసం సాధనా టాప్ చుట్టుపక్కల నలభై పల్లెటూళ్లు ఉన్నాయి. ఈ పల్లెల్లో ఉన్నవారు పనుల కోసం ఉపాధి కోసం నిత్యం సాధనా టాప్ గుండా కాశ్మీర్లో రాకపోక లు సాగిస్తూ ఉంటారు. అయితే ఉగ్రవాదులు, సంఘ విద్రోహులు ఈ గ్రామీణులతో కలిసిపోయి ప్రయాణించే వీలు ఉంటుంది. సైనికులు వీరిని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ గ్రామీణుల్లో మహిళలు కూడా ఉంటారు కనుక మగ సైనికులకు పరిమితులు ఏర్పడుతున్నాయి. అలాంటి సమయంలో సోదాకు మహిళా సైనికులు అవసరమని ఉమెన్ రైఫిల్స్‌ను నియమించారు. వీరు విధుల్లో చేరినప్పటి నుంచి గ్రామీణులు సౌకర్యంగా ఉంటున్నారట. మగ సైనికులతో మాట కలపడం కంటే మహిళా సైనికులతో మాట కలపడం సులువుగా ఉందని వారి అభిప్రాయం. ఇక మహిళలైతే సైనికులైనా వారూ సాటి మహిళలే కనుక ధైర్యం గా సోదాలకు సహకరిస్తున్నారు. అదే సమయంలో ఇంత ప్రమాదకరమైన చోట విధులను నిర్వర్తిస్తున్న వారిని చూసి మెచ్చుకుంటున్నారు. ఆర్మీలో, నేవీలో, ఎయిర్‌ఫోర్స్‌లో వినిపిస్తున్న స్త్రీల విజయాలకు ఇది ఒక కొనసాగింపు. సాహస కొనసాగింపు. -
అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న అధునాతన రైఫిళ్ల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా నుంచి 73 వేల రైఫిళ్లను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో కొనుగోలుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారని అధికారులు వెల్లడించారు. సిగ్ సూయేర్ అని పిలవబడే ఈ రైఫిళ్లను 3,600 కిలోమీటర్లు ఉన్న చైనా సరిహద్దు ప్రాంతంలోని భద్రతా బలగాలకు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. రైఫిళ్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం వారంలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఒప్పందం పూర్తయిన సంవత్సరంలో రైఫిళ్లను డెలివరీ చేస్తారని సంబంధిత అధికారులు వివరించారు. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. -
రాందేవ్ ఫుడ్ పార్కులో తుపాకుల కలకలం
అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఏడు రైఫిల్స్, భారీగా లాఠీలు కనిపించాయని, వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించామని గర్వాల్ ఐజీ సంజయ్ గుంజ్యాల్ చెప్పారు. ఫుడ్ పార్కులో ప్రైవేటు గార్డులుగా పనిచేస్తోన్న ఏడుగురిని కూడా పోలీసులు అరెస్టుచేశారు. హరిద్వార్‌లోని పతంజలి హెర్బల్ ఫుడ్స్ అండ్ హెర్బల్ పార్కు నుంచి వివిధప్రాంతాలకు మందులు సరఫరాచేసే విషయంలో స్థానిక ట్రాలీ యూనియన్ నాయకులు, ఫుడ్ పార్కు సిబ్బందికి మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటు పోలీసులు అరెస్టుచేసిన రాందేవ్ సోదరుడు రాంభరత్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఆత్మరక్షణలో భాగంగానే పార్కు సిబ్బంది ట్రాలీ యూనియన్ నాయకులపై ప్రతిదాడి చేయాల్సివచ్చిందని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రాంభరత్ను ఈ కేసులో ఇరికించారని రాందేవ్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ మీడియాతో అన్నారు.