జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో తరచూ ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అటు భద్రతా బలగాలు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఉగ్రవాదులను తరిమికొట్టే పనిలో పడ్డారు.
జమ్ముకశ్మీర్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో పోరాడేందుకు విలేజ్ సెక్యూరిటీ గ్రూప్ (వీడీజీ) సభ్యులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు ఆధునిక ఆయుధాలు అందజేస్తున్నారు. గ్రామస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఎస్‌ఎల్‌ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)లను పోలీసులు ఇస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించినపక్షంలో వారికి గ్రామస్తులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీడీజీ సభ్యులతో పాటు మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లకు పిలిపించి వారికి ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లను అందజేస్తున్నారు.
ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడేందుకు మానసికంగా సిద్ధమయ్యేలా గ్రామస్తుల్లో ధైర్యం, మనోధైర్యాన్ని వీడీజీ సభ్యులు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ధార్ సక్రికి చెందిన చైన్ సింగ్, జస్వంత్ సింగ్, గబ్బర్, రొమేష్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ గ్రామాల్లోని పలువురిని చంపేశారన్నారు. ఆ తర్వాత గ్రామ భద్రతా కమిటీలు తమకు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ అందజేశాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment