ఇంఫాల్/న్యూఢిల్లీ: గిరిజన, గిరిజనేతరుల నడుమ భీకర ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఆహారం, నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు.
మణిపూర్‌లో పరిణామాలపై దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. íగిరిజనేతరులైన మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ మణిపూర్ హైకోర్టుజారీ చేసిన ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ సమర్పించారు. హింసాకాండపై సమగ్ర దర్యాప్తును కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment