![APSRTC: Cm Jagan Green Signal For Purchase Of 2736 New Buses - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/7/cm-ys-jagan-123.jpg.webp?itok=nEAcD_6u)
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు పడ్డాయి. భారీగా సొంత బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2,736 కొత్త బస్సుల కొనుగోలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు, జీసీసీ మోడల్ లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేస్తున్నామని ఆయన తెలిపారు.
‘‘36 కొత్త అద్దె బస్సులు తీసుకోబోతున్నాం. వీలైతే కర్ణా టక తరహాలో 15 మీటర్ల అంబారీ బస్సులు. కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం కొన్ని బస్సులు తీసేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో 15 ఏళ్ల సర్వీసు దాటిన బస్సులు కేవలం 221 మాత్రమే ఉన్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే విషయంపై ఒడిశా, కర్ణాటకతో ఒప్పందాలు పూర్తయ్యాయి. తమిళనాడు, తెలంగాణతో త్వరలోనే ఒప్పందాలు చేసుకుంటాం’’ అని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.
చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment