
సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు అవసమరైన అన్ని చర్య లు తీసుకోవాలని ఆ సంస్థ పాలకమండలి నిర్ణయించింది. క్యాడర్ స్ట్రెంత్ సర్దుబాటుతో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన విధానాన్ని రూపొందించాలని తీర్మానించింది.
కాగా, విజయవాడ ఆర్టీసీ భవన్‌లో గురువారం పాలకమండలి సమావేశం జరిగింది. కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు 100 ఈ–బస్సు లను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు కూడా సమావేశంలో నిర్ణయించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆమో దించినందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ మల్లి కార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరు మలరావు, డైరెక్టర్ రాజ్‌రెడ్డి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బలహీనపడిన అల్పపీడనం.. ఇక గట్టి వానలు తగ్గినట్టే!