
ఐనాక్స్ విండ్ చేతికి సరయూ విండ్ పవర్
ఐనాక్స్ విండ్ అనుబంధ కంపెనీ ఐనాక్స్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ముంబై: ఐనాక్స్ విండ్ అనుబంధ కంపెనీ ఐనాక్స్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఏపీలోని కొండాపురంలో ఉన్న సరయూ విండ్ పవర్‌ను కొనుగోలు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణే లక్ష్యంగా ఐనాక్స్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్.. సరయూ విండ్ పవర్‌ను కొనుగోలు చేసిందని ఐనాక్స్ విండ్ పేర్కొంది. డీల్ తక్షణం అమల్లోకి వస్తుందని బీఎస్‌ఈకి నివేదించింది.