వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి.. | Car Accident Tragedy In Nizamabad | Sakshi
Sakshi News home page

Kamareddy: టపాసులు కొనడానికి వెళ్లి.. 

Nov 3 2021 5:26 PM | Updated on Nov 4 2021 1:56 AM

Car Accident Tragedy In Nizamabad - Sakshi

కామారెడ్డి (నిజామాబాద్‌): తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, టపాసులు కొనడానికి కారులో వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.  

కారులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిలో..  జగన్ (45), ఆనంద్ (28), శ్రీనివాస్ (52), శశాంక్‌ ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నట్టు  గుర్తించారు. కామారెడ్డిలో టపాసులు కొనుగోలు చేసి.. ఎల్లారెడ్డివైపు వెళ్తుండగా కారు ప్రమాదం సంభవించింది.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement