న్యూఢిల్లీ: రెడీ టు కుక్ బ్రాండ్, కేరళ సంస్థ బ్రాహ్మిన్స్‌ను కొనుగోలు చేసినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ తాజాగా పేర్కొంది. సంప్రదాయ వెజిటేరియన్, స్పైస్ మిక్స్ సంస్థ బ్రాహ్మిన్స్ కొనుగోలు విలువను వెల్లడించలేదు.
ఆరు నెలల క్రితం రెడీ టు కుక్ ఫుడ్ తయారీ బ్రాండు నిరపరను సొంతం చేసుకోవడం ద్వారా అజీం ప్రేమ్‌జీ కంపెనీ విప్రో ఎంటర్‌ప్రైజెస్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజా కొనుగోలుతో ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ విభాగంలో మరింత విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు విప్రో కన్జూమర్ పేర్కొంది. వెరసి దక్షిణాది మార్కెట్ లక్ష్యంగా సొంత స్నాక్స్ బ్రాండును ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. వేగవంత వృద్ధిలో ఉన్న రెడీ టు ఈట్ విభాగంలో సొంత బ్రాండును విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ వినీత్ అగర్వాల్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment