Ravindra Kumar
-
ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో జెండా పీకేశారు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నట్లుగా అర్థం అవుతోంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేశినేని నానితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరువూరు సభకు రావాలని అధిష్టానం దూతగా కోరినట్లు తెలిసింది. అయితే ఆయన ససేమిరా అంటూ తిరస్కరించారని సమాచారం. ఆదివారం సైతం తన రాజీనామాపై స్పందించారు. రాజీనామా చేస్తామని చెప్పాక కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీనిని బట్టి ఎంపీ కేశినేని నాని పూర్తిగా టీడీపీ నుంచి వెళ్లిపోవటానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీ ఆదివారం తన కార్యాలయంలో అనుచరులతో మంతనాలు జరిపారు. తిరువూరులో జరిగిన రా కదిలిరా సభకు ఎంపీ కేశినేని నాని అనుచరులు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, రామసుబ్బారావు, వాసన్ మునెయ్య, చెరుకూరి రాజేశ్వరరావు, దేవభక్తుని సీతారాం ప్రసాద్, జక్కె వెంకటేశ్వరరావుతో తదితరులు దూరంగా ఉన్నారు. తిరువూరు సభలో సీటు కేటాయించినా.. తిరువూరు సభలో టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. తిరువూరు సభలో ముందు వరుసలో ఎంపీ కేశినేని నానికి సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో సైతం ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ఫొటోలు వేశారు. ఈ విషయం ఎంపీ కేశినేని నాని దృష్టికి మీడియా తీసుకెళ్తే.. ‘నాకు ప్రొటోకాల్ ఇచ్చామని, పాటిస్తున్నామని చెప్పుకోవటానికి బ్యానర్లలో ఫొటోలు వేశారు. గతంలో ప్రొటోకాల్ పాటించలేదే’ అని ప్రశ్నించారు. అన్ని పద్ధతులూ పాటిస్తున్నామని చెప్పుకోవటానికే ఇదంతా అని అన్నారు. ఇదేదో తనమీద, ప్రేమ, గౌరవంతో చేసిన విషయం కాదని తేల్చి చెప్పారు. తమ తప్పు లేదని విజయవాడలో మీడియాకు చెప్పుకోవటానికి గిమ్మిక్కు చేశారని ఎద్దేవా చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచాక, తనకు పలు అవకాశాలు వచ్చాయన్నారు. అయితే అప్పట్లో టీడీపీని వీడాలనేది తన ఉద్దేశం కాదని కేశినేని నాని అన్నారు. కష్టాల్లో ఉన్న అధినేత చంద్రబాబుకు అండగా ఉండాలని ఆయన వెంటే నడిచానన్నారు. ఇప్పుడేమో తన వద్దకు దూతలను పంపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని, పట్టించుకోవద్దని చెబుతున్నారని ఆరోపించారు. అధినేత ఆదేశాలను శిరసావహిస్తున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఎంపీ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. అనుచరులతో చర్చించి విజయవాడ పార్లమెంటు పరిధిలో తన అనుచరులుగా ఉన్న ఎంకే బేగ్, బొమ్మసాని సుబ్బారావు, స్వామిదాస్, మరికొంత మంది పరిస్థితి ఏమిటని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘వేచి చూడండి’ అని నాని బదులిచ్చారు. ప్రజాస్వామంలో డిసైడ్ చేసేది ప్రజలే. తనను నమ్ముకొని విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని వేల మంది అనుచరులు, శ్రేయోభిలాషులు ఉన్నారని పేర్కొన్నారు. వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, తన ఒక్కడి నిర్ణయం కాకుండా, వారి ఆలోచనలకు అనుగుణంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని, మూడో సారి తానే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. -
దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం విజేత ఎవరు..!
దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం దేవరకొండ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆర్.రవీంద్ర కుమార్ మూడోసారి విజయం సాదించారు.2004,2014లలో సిపిఐ పక్షాన గెలిచిన రవీంద్ర కుమార్ 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 2014లో విజయం సాదించిన కొంతకాలానికి ఆయన అదికార టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఎన్నికలో ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌పై 38848 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రవీంద్రకుమార్‌కు 96454 ఓట్లు రాగా, బాలూనాయక్‌కు 57606 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి పక్షాన పోటీచేసిన బిల్యా నాయక్‌కు 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో కాంగ్రెస్ ఐ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ తెలంగాణ లో దేవరకొండ ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. 2014లో రమావత్ రవీంద్ర కుమార్ తన సమీప టిడిపి-బిజెపి కూటమి ప్రత్యర్ధి బిల్యానాయక్ పై 4216 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు . దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఏడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి. సిపిఐ నాయకుడు బద్దు చౌహాన్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. గిరిజన నేత రవీంద్రనాయక్ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2004లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. దేవరకొండలో ఒక్కసారి కూడా టిడిపి గెలవలేదు. రవీంద్రనాయక్ గతంలో భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 1999లో ఇక్కడ గెలిచిన రాగ్యానాయక్ 2001 డిసెంబర్లో నక్సల్స్ కాల్పులలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో రాగ్యానాయక్ భార్య భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం భారతి ఎమ్మెల్సిగా కూడా ఎన్నికయ్యారు. దేవరకొండ ఎస్.టి.లకు రిజర్వు కాక ముందు రెడ్లు రెండుసార్లు బ్రాహ్మణ ఒకసారి గెలిచారు. దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
దక్షిణాదికి లుపిన్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డయాగ్నోస్టిక్స్ సేవల్లో ఉన్న లుపిన్ డయాగ్నోస్టిక్స్ దక్షిణాదిలో అడుగుపెట్టింది. రీజినల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. దీంతో సంస్థ ఖాతాలో దేశవ్యాప్తంగా ల్యాబ్స్ సంఖ్య 24కు చేరిందని లుపిన్ డయాగ్నోస్టిక్స్ సీఈవో రవీంద్ర కుమార్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘నవీ ముంబైలో నేషనల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ ఉంది. 380కిపైగా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ సెంటర్లు (లుపిమిత్ర) ఉన్నాయి. 400 మందికి పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. లుపిమిత్ర కేంద్రాల ఏర్పాటుకు ఫ్రాంచైజీలను ఆహ్వానిస్తున్నాం. ఏడాదిలో దేశవ్యాప్తంగా 100 ల్యాబ్స్ నెలకొల్పుతాం. ప్రతి ల్యాబ్ ఏర్పాటైన 18 నెలల్లోనే ఎన్ఏబీహెచ్ ధ్రువీకరణ పొందాలన్నదే మా లక్ష్యం’ అని ఆయన వివరించారు. -
సీఎంపై విశ్వాసముంది
నల్లగొండ ఎంపీ గుత్తా సాక్షి, నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసముందని, అందు కే ఆయన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ను ప్రకటించానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తనకు అసంతృప్తి ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేద న్నా రు. శనివారం నల్లగొండలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో కలసి ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో తనకు భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న రోజే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. -
బడ్జెట్ నిరాశాజనకం.. : సున్నం రాజయ్య
బడ్జెట్లో రైతులు, కార్మికులు, ఉద్యోగులతోపాటు 10 జిల్లాల సమగ్రాభివృద్ధికి తగ్గ అంశాలు లేవు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ కాదు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక సాధించుకున్నాం. ఈ చట్టాన్ని పూర్తిగా ఆ వర్గాలకే అమలు చేయాలి. బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే ఎస్సీలకు భూపంపిణీకి 30 ఏళ్లు పడుతుంది. భూములు పోడు చేసుకుంటున్న 12 లక్షలమంది గిరిజనులకు పట్టాలివ్వాలి. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును రద్దు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. మేము అటు(అధికార), ఇటు(ప్రతిపక్షం) కాదు, ప్రజల పక్షం. అయోమయం.. అంకెల గారడీ.. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రణాళిక బడ్జెట్లో అయోమయం, అంకెల మార్పు, అంకెల గారడీగా ఉందేమో మంత్రి వివరణ నివ్వాలి. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను ఎట్లా భర్తీ చేస్తారో చెప్పాలి. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. కరెంట్ సమస్యను అధిగమించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ప్రభుత్వం 14 అంశాలపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏ నివేదికలిచ్చాయో బడ్జెట్లో పేర్కొనలే దు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణకు నక్కలగండి నుంచి డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి. ఈ బడ్జెట్‌కాకపోయినా.. వచ్చే బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలి. బీబీనగర్ ఆస్పత్రికి నిధులివ్వాలి. దళితులతోపాటు గిరిజనులకు కూడా భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాలి. బీసీలకు తక్కువ నిధులు కేటాయించారు. చేనేత కార్మికులను విస్మరించడం సరికాదు. వారిని ఆదుకోవాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించాలి. తెలంగాణ సాధన కోసం 1,200 మంది ఆత్మ బలిదానం చేసినందున, 459 మందికే పరిహారం పరిమితం చేయకుండా అందరికీ రూ.10 లక్షల పరిహారం ఇచ్చి, ఇళ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలి. -
పావగడలో దొంగల బీభత్సం
పావగడ, న్యూస్‌లైన్ : పావగడలో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో అలంకార థియేటర్ ఎదురుగా ఉన్న విద్యానగర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కాలనీలోని హెల్త్ అసిస్టెంట్ రవిచంద్ర కుమార్ ఇంట్లోకి జొరబడి సుమారు రూ.3.60 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై శనివారం పోలీసులు, బాధితుల తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి రవిచంద్రకుమార్, భార్య నాగకీర్తి, అతని తల్లి గంగమ్మ, పదేళ్లలోపున్న కుమారులు ప్రణబ్, ప్రణీత్ నిద్రపోయారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దుండగులు గేటు తాళాలు పగులగొట్టి కాంపౌండ్ లోపలకు వచ్చి, మెయిన్ డోర్‌కున్న లాక్‌ను బండరాయితో ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని వారు మేల్కొనే సరికే డ్రాయర్లతో ఉన్న ముగ్గురు లోపలకు వచ్చేశారు. ‘మీకు ఎలాంటి హాని తలపెట్టం.. బంగారు నగలు, డబ్బు ఇవ్వండి’ అంటూ కత్తితో బెదిరించారు. ప్రాణ భయంతో రవిచంద్ర కుమార్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వగా, అతని భార్య తన ఒంటిపై ఉన్న బంగారు నగలను ఇచ్చేసింది. తర్వాత గంగమ్మ మెడలోని మాంగల్యం సరం, ముత్యాల సరం, చెవిలో కమ్మల్ని దుండగులు కాజేశారు. వారిని ఒక గదిలో బంధించి, డబ్బు కోసం ఇంట్లోని బీరువాలో వెదుకుతుండగా, గంగమ్మ కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. స్థానికుల సమాచారంతో సీఐ భానుప్రసాద్, ఎస్ఐ అశోక్‌కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దొంగల ఆచూకీ కోసం చుట్టుపక్కల భారీగా గాలించారు. తుమకూరు నుంచి జాగిలాలను రప్పించగా, అవి ఇంటి నుంచి కొంతదూరం పట్టణం వైపు వెళ్లి తిరిగొచ్చేశాయి. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. కాగా దోపిడీ దొంగలు 25.-30 ఏళ్ల లోపు ఉన్న వారేనని, వారు అచ్చ తెలుగులో మాట్లాడారని, ఇంటి బయట కూడా మరో దొంగ కాపలా ఉన్నాడని బాధితులు పోలీసులకు వివరించారు. ఏఎస్పీ లక్ష్మణ్, మధుగిరి సబ్ డివిజన్ డీఎస్పీ గురుస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులు దొంగల రూపురేఖలను చెప్పిన మేరకు వారి ఊహా చిత్రాలను పోలీసులు రూపొందించారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రసాద్ తెలిపారు.