ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసముందని, అందు కే ఆయన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ను ప్రకటించానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
నల్లగొండ ఎంపీ గుత్తా
సాక్షి, నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసముందని, అందు కే ఆయన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ను ప్రకటించానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తనకు అసంతృప్తి ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేద న్నా రు. శనివారం నల్లగొండలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో కలసి ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో తనకు భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న రోజే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు.