ఎన్నికల్లో పార్టీ ఓటమి సమిష్టి వైఫల్యం:గుత్తా
హైదరాబాద్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి సమిష్టి వైఫల్యమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమై ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. అనంతరం గుత్తా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోయామన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మరని గుత్తా వ్యాఖ్యానించారు. ఆయన ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యమా... లేదా అనేది టీఆర్ఎస్ పాలనలో తేలుతుందని అన్నారు. ఈ అయిదేళ్లూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన జైపాల్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే.