అనారోగ్యం శారీరకమైనదే కాదు. మానసికమైనది కూడా. కొంతమంది శారీరక రుగ్మతలతో బాధపడుతున్నా మానసికంగా వాటన్నింటినీ జయిస్తుంటారు. మరికొందరేమో శారీరకంగా బాగున్నా, లేనిపోని భయాలతో అనవసర సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. మరి మీ సంగతేమిటి? మీలో మానసిక బలం ఎంత? ఒకసారి విశ్లేషించుకునేందుకే ఈ సెల్ఫ్ చెక్.
1. ప్రపంచాన్ని చుట్టుముడుతున్న వివిధ వ్యాధుల గురించి తెలుసుకోవాలని అమిత ఆసక్తి చూపుతుంటారు.
ఎ. అవును బి. కాదు
2. మీ ఆరోగ్యం గురించి నిత్యం ఆందోళనకు గురవుతుంటారు.
ఎ. అవును బి. కాదు
3. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదన్న చింత మిమ్మల్ని వేధిస్తుంటుంది.
ఎ. అవును బి. కాదు
4. వయసుకు తగిన బరువు, ఎత్తు లేనన్న సంశయం మనసును తొలిచేస్తుంటుంది.
ఎ. అవును బి. కాదు
5. వైద్యపరంగా సరైన నిర్ధారణలు లేని వ్యాధులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయనే దిగులు మీలో ఎక్కువవుతోంది.
ఎ. అవును బి. కాదు
6. ఒంట్లో బాగుండటం లేదని తరచుగా ఆఫీసుకు సెలవు పెడుతుంటారు.
ఎ. అవును బి. కాదు
7. ఒత్తిళ్లు ఎదురైనప్పుడు మీ గుండె చాలా వేగంగా కొట్టుకుని గుండెపోటు వచ్చేలా ఉందని భయపడుతుంటారు.
ఎ. అవును బి. కాదు
8. పెరుగుతున్న వయసు, మృత్యుభయం తరచూ మీపై స్వైరవిహారం చేస్తున్నట్లు అనిపిస్తోంది.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువ వస్తే మీలో విపరీతమైన ఆందోళనలు ఉన్నాయని చెప్పవచ్చు. చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేరు. మీది సానుభూతి కోరుకునే తత్వం. ఈ లక్షణాలను మీరు ఇలాగే పెంచి పోషించుకుంటే భవిష్యత్తులో మీరు అన్నింటికీ అవస్థలు పడాల్సిందే. ‘ఎ’లు కన్నా ‘బి’ ఎక్కువగా వస్తే మానసిక సంబంధమైన సమస్యలకు మీరు చాలావరకు దూరంగా ఉన్నట్లే లెక్క. మీ గురించి మీకు ఆందోళనలు కాస్తోకూస్తో ఉన్నా అవి సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు భావించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment