సాక్షి, ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అఖిల భారత సర్వీస్ ‘ప్రిలిమ్స్ పరీక్షా’ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఈ ఏడాది మే 28వ తేదీన ఈ పరీక్ష జరగ్గా.. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 14, 264 మంది సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించారు. UPSC షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది.
ఇక ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవాళ్లు.. మెయిన్స్ కోసం మళ్లీ డిటైల్డ్ ఫామ్-1 నింపి.. దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ చెబుతోంది. త్వరలోనే ఇందుకు తేదీలను ప్రకటించనుంది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి https://www.upsc.gov.in/
Comments
Please login to add a commentAdd a comment