UPSC prelims exam
-
UPSC 2023: సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అఖిల భారత సర్వీస్ ‘ప్రిలిమ్స్ పరీక్షా’ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఈ ఏడాది మే 28వ తేదీన ఈ పరీక్ష జరగ్గా.. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 14, 264 మంది సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించారు. UPSC షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఇక ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవాళ్లు.. మెయిన్స్ కోసం మళ్లీ డిటైల్డ్ ఫామ్-1 నింపి.. దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ చెబుతోంది. త్వరలోనే ఇందుకు తేదీలను ప్రకటించనుంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి https://www.upsc.gov.in/ -
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2020 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తోంది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తుచేయగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఏపీలో పరీక్షల నిర్వహణకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా యూపీఎస్సీ నియమించింది. అభ్యర్థుల ఈ–అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా సివిల్స్ తుది ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ–అడ్మిట్ కార్డులను భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. (50 రూపాయలకే ఎమ్ఆర్ఐ స్కాన్) తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయనున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్ సూపర్వైజర్ శ్వేతా మహంతి తెలిపారు. అలాగే వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్ వైజర్లతో పాటు 99 లోకల్ ఇన్స్పెక్షన్ అధికారులు, 34 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. -
యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాయిదాకు సుప్రీం నో
చివరి నిమిషంలో వాయిదా వీలుపడదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఫిర్యాదుదారుడికి నిరాశే ఎదురైంది. 9లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షను చివరి నిమిషంలో వాయిదా వేయడం వీలుపడదని పిటిషనర్ అంగేష్ కుమార్‌కు అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆదివారం పరీక్ష జరగనున్న నేపథ్యంలో శనివారం కోర్టుకు సెలవుదినమైనా ఈ పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారించిన జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. సైన్స్ విద్యార్థులకు ఈ పరీక్ష అనుకూలంగా ఉందన్న వాదనను అంగీకరించలేదు. విద్యార్థులు ఆందోళన లేవనెత్తిన కాంప్రహెన్షన్ విభాగం తొలగించడం వల్ల సమస్య పరిష్కారమైందని తెలిపింది. ప్రిలిమినరీస్‌లో ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయనవసరం లేదని యూపీఎస్సీ చెప్పిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. మీ ఇబ్బందులు తొలగడం వల్ల మీకు కూడా మంచి అవకాశాలున్నాయని పిటిషనర్‌కు చెప్పింది. సైన్స్, మెడిసిన్ వైపు వెళ్లే విద్యార్థులు తెలివైన వాళ్లు కాబట్టే.. ఇతర సబ్జెక్టులను నుంచి వచ్చేవారి కన్నా వారెక్కువ ప్రతిభ కనబరుస్తారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విద్యావిషయాలపై నిర్ణయాన్ని ప్రభుత్వానికి, నిపుణులకు విడిచిపెట్టాలని ధర్మాసనం తెలిపింది. కోర్టును ఇంత ఆలస్యంగా ఎందుకు ఆశ్రయించారని, తొమ్మిది లక్షల మంది సన్నద్ధమైన ఈ పరీక్షకు ఒక్కరు సిద్ధం కాకపోతే చేయగలిగేదేముందని ధర్మాసనం అంగేష్ను ప్రశ్నించింది. పిటిషన్లో యోగ్యతలు లేవంటూ దానిని సుప్రీం కోర్టు కొట్టివేిసింది.