
సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈనెల 5న నిర్వహిం చిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను బుధవారం వెల్లడించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి నంబర్లను యూపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
వీరంతా ఫామ్–1ను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రిలిమ్స్ ‘కీ’, కటాఫ్ మార్కులు సివిల్స్–2022 ముగిసిన తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతా మని యూపీఎస్సీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment