సాక్షి, ఆదిలాబాద్: కష్టాలు ఎన్ని ఎదురైనా ఆ యువకుడి అంకితభావం ముందు నిలువలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంట మనిషి కుమారుడు యూపీఎస్సీలో విజేతగా నిలిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన యువకుడు డోంగ్రి రేవయ్య సివిల్స్‌లో 410వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు.
రేవయ్య.. తల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. తండ్రి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన కానీ తల్లి ఉన్నత చదువులు చదివించింది.. సివిల్స్ ర్యాంకు సాధించి తల్లి కలను నేరవేర్చారు..
కష్టే ఫలి.. పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని పలువురు విద్యార్థులు నిరూపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్నాటిపేటకు చెందిన యువకుడు అజ్మీరా సంకేత్ 35 ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సివిల్స్ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు అజ్మీరా సంకేత్‌ను అభినందించారు.
శాఖమూరి సాయిహర్షిత్
సివిల్స్‌లో ఓరుగల్లు బిడ్డ ప్రతిభ
సివిల్స్‌లో ఓరుగల్లు బిడ్డ తన ప్రతిభ కనబర్చాడు. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీకి చెందిన శాఖమూరి సాయిహర్షిత్ 40వ ర్యాంక్ సాధించాడు. 22 సంవత్సరాల హర్షిత్.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివాడు.
చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి
Comments
Please login to add a commentAdd a comment