సివిల్స్‌లో రష్మితకు 534వ ర్యాంకు | Rasmitha Get 534 Rank in UPSC Civils Rank East Godavari | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో రష్మితకు 534వ ర్యాంకు

Published Thu, Aug 6 2020 7:42 AM | Last Updated on Thu, Aug 6 2020 7:42 AM

Rasmitha Get 534 Rank in UPSC Civils Rank East Godavari - Sakshi

తూర్పుగోదావరి,అంబాజీపేట: యుపీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ ఫలితాలలో నీతిపూడి రష్మితారావు 534వ ర్యాంకు సాధించడం పట్ల పుల్లేటికుర్రు శివారు కొల్లివారిపేట కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.  రష్మిత ఇంటర్‌ వరకు విశాఖపట్నంలో విద్యనభ్యసించి, బీటెక్, ఎంటెక్‌లను కాన్పూర్‌ ఐఐటీలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌లో రెండు సార్లు హాజరై నిరాశపడకుండా మూడో సారి విజయం సాధించడంపై పుల్లేటికుర్రులో సొసైటీ అధ్యక్షుడు నీతిపూడి వెంకటరమణ, విలసిత మంగతాయారు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రష్మితారావు తల్లిదండ్రులు నీతిపూడి భాస్కరరావు, డాక్టర్‌ విశ్వమిత్రలు కొల్లివారిపేటలో నివాసముండేవారు. వృత్తిరీత్యా భాస్కరరావు గుంటూరు ప్రభుత్వాస్పత్రి మత్తు విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. తల్లి డాక్టర్‌ విశ్వమిత్ర కాకినాడ ప్రభుత్వాస్పత్రి కంటి విభాగంలో సేవలందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement