కర్ణాటక: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చంటూ గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వైరల్ అవుతోంది. విషయానికొస్తే.. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో బెంగళూరు లోకల్ బస్సు కండక్టర్ సత్తా చాటాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. ఇక ఇది కూడా పూర్తి చేస్తే అతడు ఏకంగా కండక్టర్ నుంచి కలెక్టర్ స్థాయికి చేరిపోతాడు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. (ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?)
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్త ఫేక్ అని తెలుస్తోంది. మధు ఎన్‌సీ అనే కండక్టర్ యూపీఎస్‌సీ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మధు పేరుతో వచ్చిన ఆ రిజల్ట్ మధు కుమారి అని బెంగళూరుకు చెందిన వేరే అమ్మాయిదని తేలింది. దీంతో తప్పుడు సమాచారంతో మీడియాను తప్పుదోవ పట్టించిన మధుపై బీఎంటీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు.
We’ve come to know that the BMTC bus conductor who claimed to have cracked the IAS Mains exam was lying. We have reason to believe that the roll number he showed us didn't belong to him. (1/2)
— Bangalore Mirror (@BangaloreMirror) January 30, 2020
Comments
Please login to add a commentAdd a comment