జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం | UPSC Recruitment 2021: Salary Upto Rs 1.5 lakh, Vacancies In I And B, Home Ministry | Sakshi
Sakshi News home page

జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం

Published Tue, Jul 27 2021 7:21 PM | Last Updated on Tue, Jul 27 2021 7:24 PM

UPSC Recruitment 2021: Salary Upto Rs 1.5 lakh, Vacancies In I And B, Home Ministry - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల(34 ఖాళీలు) భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్‌ డిగ్రీ లేదా జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌లో డిప్లోమా లేదా పీజీ డిప్లోమా ఉన్న వారిని అర్హులుగా ప్రకటించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేసుకోవడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో చూడవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్‌ చదివి విద్యార్హతలు, వయసు తదితర అంశాలను తెలుసుకోవాలి.

ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు- 34
తెలుగు- 5
హిందీ- 9
ఇంగ్లీష్- 3
పంజాబీ- 3
ఒడియా- 3
బెంగాలీ- 1
మరాఠీ- 5
గుజరాతీ- 1
అస్సామీ- 2
మణిపూరి- 2

పోస్టులు: సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
సంఖ్య: 34
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ లేదా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
అనుభవం: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్‌పేపర్‌లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతనం: ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement