జైపూర్ : ప్రేమలో పడితే లక్ష్యానికి దూరమవుతారు.. అనుకున్నది సాధించలేరు అనుకునే వారి అభిప్రాయలను తప్పని నిరూపించాడు యూపీఎస్సీ టాపర్ కనిషక్ కటారియా. నిజమైన ప్రేమ జీవితంలో ముందుకు వెళ్లేందుకు చేయూతగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో ఆలిండియా టాపర్‌గా నిలిచిన వేళ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘ఈ విజయ సాధనలో నాకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, నా గర్ల్‌ఫ్రెండ్‌కి, స్నేహితులకు ధన్యవాదాలు. మీరిచ్చిన మద్దతుని ఎన్నటికి మరచిపోలేను. యూపీఎస్పీ పరీక్షలో నేను మొదటి ర్యాంక్ సాధించాననే విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. ప్రజలు నన్ను మంచి అధికారిగా చూడాలని కోరుకుంటున్నారు. నా ఉద్దేశం కూడా అదే’ అంటూ చెప్పుకొచ్చారు.
Kanishak Kataria, AIR 1 in #UPSC final exam: It's a very surprising moment. I never expected to get the 1st rank. I thank my parents, sister & my girlfriend for the help & moral support. People will expect me to be a good administrator & that's exactly my intention. #Rajasthan pic.twitter.com/IBwhW8TJUs
— ANI (@ANI) April 5, 2019
అయితే యూపీఎస్సీ లాంటి ప్రతిష్టాత్మక పరీక్షలో విజయం సాధించిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌కు పబ్లిక్‌గా ధన్యవాదాలు చెప్పిన మొదటి వ్యక్తి బహుశా కనిషక్ కటారియానే అవుతాడని చెప్పవచ్చు. ఎస్సీ వర్గానికి చెందిన టాపర్ కటారియా తన ఆప్షనల్‌గా మేథమేటిక్స్ ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివారు. ఐదో ర్యాంకర్ దేశ్‌ముఖ్ భోపాల్‌లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ చేశారు. తనపై ఉన్న నమ్మకంతోనే తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని దేశ్‌ముఖ్ చెప్పారు. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా, తల్లి ప్రిస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి: మనోడికే 7వ ర్యాంక్)
Comments
Please login to add a commentAdd a comment