![Punganur Violence: Rejection Of Anticipatory Bail Petitions Of Tdp Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/1/Punganur-Violence_0.jpg.webp?itok=aKOjJD0W)
మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు.
అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి బెయిల్ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా, అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు.
చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా?
Comments
Please login to add a commentAdd a comment