లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై పెట్టిన కేసు చెల్లదంటూ హర్షసాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. హర్షసాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
లైంగికంగా వేధించాడని కేసు
హర్షసాయి తన దగ్గర రూ. 2 కోట్లు తీసుకోవడంతో పాటు లైంగికంగా వేధించాడంటూ ఓ నటి పోలీసులను ఆశ్రయించారు. దీంతో సెప్టెబర్ 24న హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నాడు.తను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయంగా పోరాడడానికి తాను సిద్ధమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ తర్వాత హర్ష సాయి ఎక్కడా కనిపించలేదు. పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉండే..ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు.
‘మెగా’ విషయంలో విభేదాలు
గుడ్ మెసేజ్.. హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్షసాయి తెలుగు స్టేట్‌లోనే కాకుండా సౌత్‌లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఆయన హీరోగా ‘మెగా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కాపీరైట్స్ విషయంలోనే విభేదాలు రావడంతో సదరు నటి హర్షసాయిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ‘మెగా’ కాపీరైట్స్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు ఆయన తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. . దీంతో అప్పటి నుంచే వారిద్దరు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా.. ఇన్నాళ్లకు వారి ప్రయత్నం ఫలించింది.
Comments
Please login to add a commentAdd a comment