సాక్షి, అమరావతి : ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫైబర్ గ్రిడ్ కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. 2021 సెప్టెంబర్‌లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును సీఐడీ ఇటీవల 25వ నిందితునిగా చేర్చిందని తెలిపారు. ఆ మేర ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు.
ఇదీ కేసు.. : చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.321 కోట్ల మేర కుంభకోణం జరిగింది. ఈ ప్రాజెక్టు టెండర్‌ను టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించారని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ 2021లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment