కల్తీ మద్యం కేసులో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌రావు ముందస్తు బెయిలు కోరుతూ నగర ....
విజయవాడ లీగల్ : కల్తీ మద్యం కేసులో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌రావు ముందస్తు బెయిలు కోరుతూ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఏపీపీ నోటీసు నిమిత్తం ఈ నెల 18కి వాయిదా వేశారు.
కృష్ణలంకలో గల స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. మల్లాది విష్ణు ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు.