పనాజీ: లూయీస్ బెర్గర్ లంచం కేసులో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్కు కోర్టు బుధవారం ముందస్తుబెయిల్ మంజూరు చేసింది. లంచం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో కామత్ ముందస్తు బెయిల్ కోసం గోవా స్థానిక కోర్టును ఆశ్రయించారు. 2010లో గోవాలో తాగునీటి వనరుల అభివృద్ధి, మురుగునీటి పారుదల పైప్‌లైన్ నిర్మాణ ప్రాజెక్టు కన్సల్టెన్సీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు న్యూజెర్సీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ లూయీస్ బెర్గర్ ఒక మంత్రికి లంచం ఇచ్చినట్టు ఇటీవల ఆమెరికా కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కామత్‌ను పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం జిల్లా, సెషన్స్ కోర్టులను ఆశ్రయించారు.
గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లూయీస్ బెర్గర్ కంపెనీ, గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు లంచంగా దాదాపు రూ. 6 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. లూయీస్ బెర్గర్ లంచం కేసులో ఇప్పటికే గోవా మాజీ మంత్రి చర్చిల్ అలెమోను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది.
మాజీ సీఎంకు ముందస్తు బెయిల్
Published Wed, Aug 19 2015 10:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement