digambar kamat
-
మాజీ సీఎంకు ముందస్తు బెయిల్
పనాజీ: లూయీస్ బెర్గర్ లంచం కేసులో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్‌కు కోర్టు బుధవారం ముందస్తుబెయిల్ మంజూరు చేసింది. లంచం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో కామత్ ముందస్తు బెయిల్ కోసం గోవా స్థానిక కోర్టును ఆశ్రయించారు. 2010లో గోవాలో తాగునీటి వనరుల అభివృద్ధి, మురుగునీటి పారుదల పైప్‌లైన్ నిర్మాణ ప్రాజెక్టు కన్సల్టెన్సీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు న్యూజెర్సీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ లూయీస్ బెర్గర్ ఒక మంత్రికి లంచం ఇచ్చినట్టు ఇటీవల ఆమెరికా కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు కామత్‌ను పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం జిల్లా, సెషన్స్ కోర్టులను ఆశ్రయించారు. గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లూయీస్ బెర్గర్ కంపెనీ, గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు లంచంగా దాదాపు రూ. 6 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. లూయీస్ బెర్గర్ లంచం కేసులో ఇప్పటికే గోవా మాజీ మంత్రి చర్చిల్ అలెమోను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. -
'ఆ మాజీ సీఎం లంచాలు తీసుకున్నారు'
గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమావో ఇద్దరూ కూడా లూయీస్ బెర్జర్ స్కాములో లంచాలు తీసుకున్నారని గోవా పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే చర్చిల్ అలెమావో అరెస్టయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి గోవా రాష్ట్రానికి భారీ నష్టం కలిగించారని వాళ్ల రిమాండు దరఖాస్తులో పోలీసులు తెలిపారు. 2010-11 సంవత్సరంలో వాళ్లకు లంచాలు ఇచ్చినట్లు లూయీస్ బెర్జర్ మాజీ అధికారి ఒకరు మేజిస్ట్రేట్ ఎదుట అంగీకరించిన విషయాన్ని కూడా రిమాండు దరఖాస్తులో పేర్కొన్నారు. వెయ్యి కోట్ల తాగు, మురుగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టును ఓ కన్సార్షియంకు అప్పగించేందుకు వీళ్లు దాదాపు 6.5 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగంబర్ కామత్‌కు రూ. 50-60 లక్షల వంతున రెండు సందర్భాల్లో చెల్లించారని, అలెమావోకు ఒకసారి 50 లక్షలు, మరోసారి 15 లక్షలు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అయితే వీళ్లిద్దరూ కూడా ఆరోపణలను ఖండిస్తున్నారు.