సాక్షి, అమరావతి/ నగరంపాలెం: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలు, మద్యం కొనుగోళ్లలో అక్రమాలు, ఉచిత ఇసుక దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు సీఐడీ అధికారుల ఎదుట శనివారం లొంగిపోయారు. ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పూచీ కత్తులు సమ ర్పించారు. ఈ మూడు కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుల్లో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోయి ఒక్కో కేసులో ఇద్దరు పూచీకత్తుతో పాటు రూ.లక్ష చొప్పున ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ కోసం దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు హాజరుకావాలని కూడా పేర్కొంది. ఆ మేరకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న బాబు పార్టీ నేతలతో కలసి ముందుగా విజయవాడ తులసీనగర్‌లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పూచీకత్తులు సమ ర్పించారు.
అనంతరం తాడేç³ల్లిలోని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాల కేసులో ముందస్తు బెయిల్‌కు అవసరమైన పూచీకత్తులు సమ ర్పించారు. చివరిగా గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్న బాబు మద్యం కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీనరేష్ కూడా ముందస్తు బెయిల్‌కోసం పూచీకత్తులు సమర్పించారు.
స్పందించని కేడర్
బాబు రాకను పురస్కరించుకుని అందరూ సీఐడీ కార్యాలయానికి రావాలని తెలుగుదేశం గ్రూపుల్లో నిన్నటి నుంచి మెస్సేజులు పెట్టినా కేడర్ స్పందించలేదు. చంద్రబాబు కారుని సీఐడీ కార్యాలయంలోకి అనుమతించగా, కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఆకారుతో లోనికి వెళ్లేందుకు పోటీపడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేశారు. యువత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొద్దిసేపు గలాటా స్పష్టించారు. చంద్రబాబు రాకను కవర్ చేసేందుకు వచ్చిన సాక్షి మీడియాపై టీడీపీ నేతలు దుర్బాషలాడుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవ చేశారు.
బాబుకు నిరసన సెగ
కంకిపాడు: పెనమలూరు సీటు సెగ టీడీపీ అధినేత చంద్రబాబుకే నేరుగా తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం కృష్ణాజిల్లా తాడిగడపలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెనమలూరు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బోడే ప్రసాద్ అనుచరులు నిరసనకు దిగారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్‌కే ఇవ్వాలని సీఐడీ కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ వెళ్లి ప్రసాద్‌కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment