ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కుషాయిగూడ: మద్యం మత్తులో ఓ ఇంట్లోకి చొరబడి భర్త ఎదుటే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యకితోపాటు... అతడిపై దాడి చేసిన నలుగురిపై ఆదివారం కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శ్రీనివాస్ సమాచారం మేరకు... రాంపల్లి సత్యనారాయణ కాలనీకి చెందిన శ్యామల లింగస్వామి ఆటో డ్రైవర్. మద్యానికి బానిసైన అతడు తరచు గొడవలు పడేవాడు. కొడుకు తీరుతో విసిగిపోయిన తల్లిదండ్రులు కొంత కాలం క్రితమే ఎస్‌ఆర్‌నగర్‌కు మకాం మార్చారు. ఈ నెల 26 ఇక్కడికొచ్చిన లింగస్వామి మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి మత్తులో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నిఖిత ఠాగూర్ అనే మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. భర్త ఎదుటే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇరుగుపొరుగు వారు లింగస్వామిని మందలించారు.
బాధితురాలి సోదరుడి సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లింగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి 41 నోటీసు జారీ చేసి వదిలేశారు. ఈ క్రమంలో చిన్న చర్లపల్లిలోని ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ వద్ద ఉన్న లింగస్వామిని గుర్తించిన మహిళ భర్త, సోదరుడు పృథ్వీ, మనీష్‌ఠాగూర్ అతడి మిత్రులు సిరాజ్, ప్రవీణ్‌లు మాట్లాడుకుందామని ఆయనను కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులోనే అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం చర్లపల్లిలోని ఓ పాస్ట్ పుడ్ సెంటర్‌కు తీసుకెళ్లి ఓ గదిలో తాళ్లతో బంధించి విచక్షణ రహితంగ చితకబాదారు. దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అవికాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధితుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: ప్రాంక్ అంటూ 300 అశ్లీల వీడియోలు..
మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు..
Comments
Please login to add a commentAdd a comment