
ప్రతీకాత్మక చిత్రం
బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, పెద్దపూడి కడకుదురు గ్రామానికి చెందిన యువతి(20) ప్రగతినగర్‌లో ఉంటూ డిప్లోమా చేస్తోంది. ఆమె కొంతకాలంగా సూరారం కాల నీకి చెందిన హరీష్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన హరీష్ ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోయాడు.
ఇంకో పెళ్ళి చేసు కుంటే అంతు చూస్తానని నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ వేధిస్తున్నాడు. హరీష్ కుటుంబసభ్యులు తమ పెళ్లి విషయమై చర్చించేందుకు ఆసక్తి చూపనందున తన పెళ్లి కాదని భావించిన బాధితురాలు గురువారం తన గదిలోనే ఆత్మహత్యాయత్నా నికి పాల్పడింది. హరీష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment