
సాక్షి, ఖమ్మం: తక్కువ వడ్డీ అంటూ చెప్పే మాయమాటలు నమ్మిన పలువురు అమాయకులు ఆ తర్వాత వేధింపులకు బలవుతున్నారు. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ చిరు వ్యాపారి తన వ్యాపార అవసరాల కోసం యాప్ ద్వారా పది రోజుల క్రితం రూ.15 వేల రుణం తీసుకున్నాడు. అందులో ఇప్పటికే రూ.14 వేలు చెల్లించినా ఇంకా రూ.15 వేలు చెల్లించాలని గత మూడు రోజుల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఆయన ససేమిరా అనడంతో అసభ్యకరమైన రీతిలో ఫొటోలు తయారుచేసి తొలుత బాధితుడికి పంపించారు. దీంతో ఆయన బతిమిలాడగా ఒక రోజు ఆగిన నిర్వాహకులు శుక్రవారం చెప్పినట్లుగానే పలువురికి ఫొటోలు పంపించారు. అంతేకాక ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇవి చదవండి: ఒక్కసారిగా చిదిమిన జీవితాలు.. ఆ గ్రామంలో విషాదఛాయలు..
Comments
Please login to add a commentAdd a comment