శ్రీకాకుళం : సీనియర్ల వేధింపులు భరించలేక విద్యార్థి అదృశ్యమైన సంఘటన శ్రీకాకుళం పట్టణంలో బుధవారం జరిగింది. వివరాలు.. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అతను ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇంట్లో వెతగ్గా లేఖ కనిపించింది.
దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు.