మాస్కో: రష్యాలోని జైలులో ఇటీవల వివాదస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్నిపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు తోడు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక వార్తా ఏజెన్సీ టాస్ వెల్లడించింది.
అయితే ఏ సెక్షన్‌పై ఎందుకు ఒలెగ్‌పై కేసు పెట్టారన్న వివరాలు తెలపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్‌కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో అన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్‌పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి.
కాగా, మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment