
సాక్షి,విజయవాడ: రెడ్‌బుక్ వేధింపులు ఉద్యోగులను వదలడం లేదు. తాజాగా ఏపీ సచివాలయంలో ఉద్యోగులు రెడ్‌బుక్ వేధింపులకు గురయ్యారు. పలువురు మిడిల్ లెవెల్ అధికారులను కూటమి ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు బదిలీ చేసింది. కులం, మతం ఆధారంగా ఎంఎల్ఓలను జీఏడీకి బదిలీ చేశారు.
ఆరుగురు ఎంఎల్ఓలు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్‌బుక్ వేధింపుల పట్ల సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారశాఖలోనూ ఇద్దరు అధికారులకు ఇదే తరహా బదిలీలు తప్పలేదు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సెక్రటేరియట్‌కు అటాచ్‌చేస్తూ ఉత్తర్వులిచ్చారు. పది రోజులుగా సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులు రెడ్‌బుక్ వేధింపులు ఎదుర్కొంటుండడం గమనార్హం.

ఇదీ చదవండి.. రైతుల భవనాన్ని కూల్చేసిన టీడీపీ
Comments
Please login to add a commentAdd a comment