సచివాలయ ఉద్యోగుల ‘స్థానికత’ వెల్లడి | Secretariat employees 'localism' revealed | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల ‘స్థానికత’ వెల్లడి

Published Wed, May 21 2014 1:23 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM

సచివాలయ ఉద్యోగుల ‘స్థానికత’ వెల్లడి - Sakshi

సచివాలయ ఉద్యోగుల ‘స్థానికత’ వెల్లడి

1,059 మంది ఆంధ్ర, 806 మంది తెలంగాణ ఉద్యోగులు
 
అభ్యంతరాల స్వీకరణకు నేటి మధ్యాహ్నం వరకు గడువు

హైదరాబాద్: సచివాలయంలోని 1,865 మంది ఉద్యోగుల స్థానికతను నిర్ధారిస్తూ ప్రభుత్వం మంగళవారం జాబితా వెల్లడించింది. వీరిలో 1,059 మంది ఆంధ్ర, 806 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులుగా పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఇటీవల ఆన్‌లైన్‌లో సేకరించిన వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగులు తమ, ఇతర ఉద్యోగుల స్థానికత వివరాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని జాబితా వెల్లడించిన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సూచించింది. ఇందుకు బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలు వస్తే పరిశీలించి సరిచేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగులను తాత్కాలికంగా విభజించాలని ప్రభుత్వం నిర్ణరుుంచిన సంగతి తెలిసిందే. కాగా అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత వెలువరించనున్న తుది జాబితా మేరకు ఉద్యోగుల విభజన జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ (ఎస్‌ఆర్) రెండో పేజీలో వారి స్థానికత వివరాలు పేర్కొనాలి. ఆయా వివరాలను శాఖాధిపతి తనిఖీ చేసి సంతకం చేయాలి. కానీ కొంతమంది ఉద్యోగుల ఎస్‌ఆర్‌లో స్థానికత వివరాలు పేర్కొనలేదు. కొంతమంది రిజిస్టర్లలో శాఖాధిపతి సంతకం లేదు. అరుుతే జీఏడీ ఉద్యోగుల ఎస్‌ఆర్‌లను పరిశీలించకుండా, ఆర్ధిక శాఖ సేకరించిన వివరాలను మాత్రమే పొందుపరుస్తూ ఉద్యోగుల స్థానికత  జాబితా వెల్లడించడం గమనార్హం.

జాబితా తప్పుల తడక

 జాబితా మొత్తం తప్పులతడకగా ఉంది. కనీసం 300 మంది తెలంగాణేతర ఉద్యోగులను తెలంగాణ జాబితాలో చేర్చారు. కేవలం ఉద్యోగుల డిక్లరేషన్ ఆధారంగా స్థానికతను నిర్ధారించకూడదు. తెలంగాణ ఉద్యోగుల జాబితాను మేము త్వరలో విడుదల చేస్తాం. ఆ మేరకు తెలంగాణ సచివాలయానికి ఉద్యోగులను కేటాయించాలి. అలాగే తెలంగాణ ఉద్యోగులను ఆంధ్ర సచివాలయానికి పంపించినా వ్యతిరేకిస్తాం. మా మనోభావాలకు విరుద్ధంగా ఉద్యోగుల విభజన జరిగితే మళ్లీ ఉద్యమిస్తాం.
 - సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు
 
 ఒక్క రోజే గడువా?


 ఉద్యోగుల స్థానికత వివరాలతో కూడిన జాబితా వెల్లడించిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఇచ్చిన ఒక్క రోజు గడువు ఎలా సరిపోతుంది? హడావుడిగా ఎందుకు చేస్తున్నారు? మేం అన్ని విభాగాలను పరిశీలించి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి తగిన సమయం ఇవ్వాలి.
 - తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షుడు పద్మాచారి
 
 ఆంధ్ర ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో లేరని తేలింది

 సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ఉద్యోగాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 42 శాతం వాటా కంటే అధికంగానే దక్కిందని తాజా జాబితా రుజువు చేసింది. కిందిస్థాయి ఉద్యోగులను మినహాయించి చూసినా తెలంగాణకు అన్యాయం జరగలేదు. హైదరాబాద్‌లో చదువుకున్న వారంతా తెలంగాణలో స్థానికులు కారని చేస్తున్న వాదనలో అర్థం లేదు.
 - సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement