Tirupati Rural
-
దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ?
తిరుపతి రూరల్: దళితులను అవమానించి ఆనందపడటం చంద్రబాబుకి అలవాటులా మారిపోయింది. ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారంటూ గతంలో మీడియా ముందే అహంకారంతో మాట్లాడిన బాబు మరోసారి దళితుల పట్ల తనకున్న చిన్నచూపును ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ రోజు తిరుపతి రూరల్ మండలం అవిలాలలోని టీడీపీ నేత వెంకటమణిప్రసాద్ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో దళిత మాజీ మంత్రి పరసారత్నాన్ని అందరి ముందు నిల్చోబెట్టి ఘోరంగా అవమానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి.. రెండు సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా కూడా చేసిన ఆయనను కనీసం తమ పక్కన కూడా బాబు కూర్చోనివ్వలేదు. దాంతో ప్రెస్‌మీట్ జరిగినంతసేపు పరసారత్నం అవమానభారంతో చెమర్చిన కళ్లతో నిల్చోనే ఉండిపోయారు. దళితులను నిత్యం అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు -
చెవిరెడ్డిపై మరోసారి దాడికి టీడీపీ యత్నం
సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్‌లో సోమవారం జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమం రసాభాసగా మారింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాకుండా చెవిరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు పచ్చ పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే, పోలీసుల సాయంతో చెవిరెడ్డి ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో పచ్చ పార్టీ నేతలు ఆదివారం రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు. -
అసెంబ్లీలో భూ ఆక్రమణలవేడి
►తిరుపతి రూరల్ భూ ఆక్రమణల లెక్కలు తీయండి ►ఆక్రమణలు ఎంత, వాటి విలువ ఎంత, వాటిపై చర్యలేంటి? ►ఏపీ అసెంబ్లీలో మంత్రిని నిలదీసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ►కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపణ ►ఆధారాలతో సహా సభ ముందుంచిన ఎమ్మెల్యే ►సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డ మంత్రి ►తప్పుడు నివేదిక, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం: మంత్రి తిరుపతి: తిరుపతి రూరల్ మండలంలో జరిగిన ప్రభుత్వ భూ ఆక్రమణల వ్యవహారం బుధవారం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చారని ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి «సభలోనే ధ్వజమెత్తడం జిల్లా రెవెన్యూ వర్గాల్లో ఆసక్తి, ఆందోళన రేపుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తిరుపతి రూరల్ మండలంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల విస్తీర్ణమెంత, ఎక్కడెక్కడ ఆక్రమణలో ఉంది, ఎవరెవరు, ఎంతెంత ఆక్రమించుకున్నారు, వాటి విలువ ఎంత, ఆక్రమణలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, ఇకపై తీసుకుబోయే చర్యలేంటి అంటూ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆయన నిలదీశారు. దీనిపై మంత్రి సమాధాన మిస్తూ 296.28 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని, వాటి విలువ 165.80 కోట్లు అని తెలిపారు. గత రెండేళ్లుగా రెవెన్యూ విభాగం ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకుంటోందని, మిగతా భూ ఆక్రమణలు తొలగించకపోతే సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దీనిపై చెవిరెడ్డి స్పందిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఇచ్చిన నివేదిక తప్పు అని తెలిపారు. ఒక తప్పుడు నివేదికను ఒక సీనియర్ మంత్రికి ఇచ్చి చదివించారని, ఇది కలెక్టర్ బాధ్యతారాహిత్యమని స్పష్టం చేశారు. 11.03.2017న తిరుపతి రూరల్ తహశీల్దార్ నివేదిక పంపుతూ 938 ఎకరాలు ఆక్రమణకు గురైందని పేర్కొన్నారని, దాని విలువ అంచనా వేయలేమని కలెక్టర్‌కు తహశీల్దార్ పంపిన నివేదికను స్పీకర్ ద్వారా మంత్రికి అందజేశారు. ఒకపక్క తహశీల్దార్ ఆక్రమిత భూముల విలువ చెప్పలేమని చెబితే, కలెక్టర్ మాత్రం రూ.165 కోట్లు అని ఏ విధంగా నివేదికలో పేర్కొన్నారని ప్రశ్నించారు. వీటితోపాటు 20 సంవత్సరాలకు ముందు ఆక్రమణకు గురైందని కలెక్టర్ మంత్రికిచ్చిన నివేదికలో పేర్కొన్నారని, ఈ మధ్య కాలంలో కూడా ఆక్రమణలకు గురైన భూములను కాపాడాలని ఇద్దరు సబ్–కలెక్టర్లు నిశాంత్‌కుమార్, హిమాంశు శుక్లా ఇచ్చిన ఆదేశాలను సభకు సమర్పించారు. ఇదే కాకుండా ఇతరత్రా నివేదికలను కూడా అందజేశారు. ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో నివేదిక అందజేయడంతో కంగుతిన్న మంత్రి కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని నిర్ధారించుకున్నారు. ఆధారాలు పరిశీలించిన మంత్రి ఎలా సమాధానం చెప్పాలో తెలియక సభలో ఇబ్బందిపడ్డారు. తప్పకుండా ఆక్రమించినవారిపై, వాస్తవ, పూర్తి నివేదిక ఇవ్వనివారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెవిరెడ్డికి హామీ ఇచ్చారు. దీనిపై చెవిరెడ్డి స్పందిస్తూ ఈ ఆక్రమణలే కాకుండా చంద్రగిరి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో 430 ఎకరాలు, భీమా నదిలో 220 ఎకరాలు ఆక్రమణదారుల పాలయ్యాయని తెలిపారు. దీని కారణంగా 2016లో కురిసిన వర్షాలకు కాలువల్లో వెళ్లాల్సిన నీరు ఊర్లపైకి వచ్చిందన్నారు. దీనివల్ల పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్పలేదన్నారు. చివరకు ప్రజలను రక్షించడానికి కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని చంద్రగిరికి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా కాలువలు, గుంటలు, చెరువులు ఎవరు ఆక్రమించుకున్నా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ అన్ని వివరాలతో మరోసారి తనను కలవాలని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రివిలేజ్ నోటిసిస్తా... కోర్టుకూ వెళ్తా బాధ్యతారాహిత్యంతో, నిర్లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి, చట్టసభలకు తప్పుడు నివేదిక ఇచ్చి తప్పుదోవ పట్టించినందుకు కలెక్టర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా పూర్తి ఆధారాలతో కోర్టుకు కూడా వెళ్లనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్‌ను చిత్తూరు జిల్లా నుంచి బదిలీ చేయాలని సభలోనే ఉన్న ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. -
విజయమ్మ దీక్షకు మద్దతుగా చెవిరెడ్డి రిలే దీక్ష
తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట వైఎస్సార్ కూడలి వద్ద శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పార్టీ నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు దీక్షకు మద్దతుగా నిలిచారు. దీక్షలో పాల్గొన్న పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ నాయకులు ప్రతి పంచాయతీలోనూ విజయమ్మ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజల కోసం విజ యమ్మ దీక్ష చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజ నకు లేఖ ద్వారా అంగీకారం తెలిపిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పు డు బస్సుయాత్ర పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పదవులకు రాజీనామా చేసి, తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రం కోసం పంచాయతీల్లో తీర్మానం చేయండి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రం కోసం పంచాయతీలు తీర్మానం చేసి, రాష్ట్రపతికి పంపాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చా రు. ప్రతి పంచాయతీలో సర్పంచ్‌లు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమైక్య ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆపేది స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల కన్వీనర్ చిన్నియాదవ్, నాయకులు గురవారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఉపేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.