తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజలందరికీ సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట వైఎస్సార్ కూడలి వద్ద శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పార్టీ నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు దీక్షకు మద్దతుగా నిలిచారు.
దీక్షలో పాల్గొన్న పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ నాయకులు ప్రతి పంచాయతీలోనూ విజయమ్మ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజల కోసం విజ యమ్మ దీక్ష చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజ నకు లేఖ ద్వారా అంగీకారం తెలిపిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పు డు బస్సుయాత్ర పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పదవులకు రాజీనామా చేసి, తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
సమైక్య రాష్ట్రం కోసం పంచాయతీల్లో తీర్మానం చేయండి
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రం కోసం పంచాయతీలు తీర్మానం చేసి, రాష్ట్రపతికి పంపాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చా రు. ప్రతి పంచాయతీలో సర్పంచ్‌లు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమైక్య ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆపేది స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల కన్వీనర్ చిన్నియాదవ్, నాయకులు గురవారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఉపేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజయమ్మ దీక్షకు మద్దతుగా చెవిరెడ్డి రిలే దీక్ష
Published Sat, Aug 24 2013 3:06 AM | Last Updated on Fri, May 25 2018 8:09 PM
Advertisement