naravari palle
-
నారావారి పల్లెలో జరిగిన అభివృద్ధిని వివరించిన మోహిత్ రెడ్డి
-
టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి వీస్తోంది. కుప్పం ప్రజలు.. చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్‌వారే ఇందుకు కారణమని సమాచారం. ఇక, తాజాగా కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినా ఉపయోగం లేదని అటు సర్వేలు కూడా చెబుతున్నాయి. తాజా సర్వేతో కుప్పం టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక, ఇటీవల చంద్రబాబు పర్యటనలో అలవికాని హామీలిచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు, 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల హడావిడిగా శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుప్పం టీడీపీలో గ్రూప్ రాజకీయాలతో చంద్రబాబుకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇంఛార్జిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం కుప్పంను చాలా అభివృద్ధి చేశారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కుప్పంకు ఈ నెలలోనే హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక, టీడీపీకి చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. చిత్తూరు, జీడి నెల్లూరు, పూతల పట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సరైన అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో, సర్వేల్లో కూడా టీడీపీ తప్పదని నివేదికలు చెబుతున్నాయి. -
THE BIG STORY : నారావారిపల్లె ఎంపీపీ స్కూల్ లో ఆధునిక సౌకర్యాలు
-
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ
-
వైఎస్సార్ సీఎం అయ్యాకే సీమకు గుర్తింపు
సాక్షి, చిత్తూరు : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే రాయలసీమకు గుర్తింపు వచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏనాడూ రాయలసీమను పట్టించుకోలేదని అన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. అధికార వికేంద్రీకరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు నారావారిపల్లెకు వచ్చిన జనమే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ జరిగిందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిపుణుల కమిటీ సూచన మేరకే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును ఓడించి కుప్పంకు పంపారు నారావారిపల్లె చాలా మంచిదని, అందుకే చంద్రబాబునాయుడిని ఓడించి కుప్పానికి పంపారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం బాగుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబం సీఎం జగన్‌ను దేవుడిలా భావిస్తున్నారని అన్నారు. -
చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయా: నవీన్
సాక్షి, తిరుపతి: అమరావతిలో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని సన్‌షైన్ ప్రొడక్షన్ లిమిటెడ్ ఎండీ, నారావారిపల్లెకు చెందిన నవీన్‌కుమార్ నాయుడు విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ ఒక్క పని కూడా నిబంధనల ప్రకారం జరగడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి కోటిన్నర రూపాయలు పెట్టి అమరావతిలో స్టూడియో నిర్మించి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి మరి స్టూడియో నిర్మించినట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వం పిలిచిన ప్రతి టెండర్లో పాల్గొన్న కానీ ఏ ఒక్క వర్క్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పన్నులన్నీ దొడ్డిదారిన సొంతవారికే కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న అక్రమాలపై చంద్రబాబు, లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని వెల్లడించారు. కాగా, చంద్రబాబు స్వగ్రామానికి చెందిన నవీన్ ఆయనపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రెస్‌క్లబ్‌లో నవీన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు నవీన్ బంధువులను పంపించి.. నవీన్‌ను అక్కడి నుంచి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నవీన్ తనకు జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. -
చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయా: నవీన్
-
నారావారిపల్లెకి వస్తే మారణహోమం తప్పదు
మంద కృష్ణ పర్యటనను అడ్డుకుంటాం: గిరిధర్ మాదిగ చంద్రగిరి: విశ్వరూప గర్జన కార్యక్రమం ప్రారంభించడానికి మంద కృష్ణ మాదిగ నారావారిపల్లెకి వస్తే మారణహోమం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు గిరిధర్ మాదిగ హెచ్చరించారు. నారావారిపల్లె అరుంధతీవాడలో మంగళవారం ఎమ్మార్పీఎస్, టీడీపీ దళిత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గిరిధర్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో ఎమ్మార్పీఎస్ నాయకుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ ఏపీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని, ఆయన సమైక్యాంధ్ర ద్రోహి అన్నారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకోవ డానికి మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్ర మంలో టీడీపీ ఎస్సీ సెల్ నేత తంగరాజు, పీఎస్ రామారావు, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.