నారావారిపల్లెకి వస్తే మారణహోమం తప్పదు
మంద కృష్ణ పర్యటనను అడ్డుకుంటాం: గిరిధర్ మాదిగ
చంద్రగిరి: విశ్వరూప గర్జన కార్యక్రమం ప్రారంభించడానికి మంద కృష్ణ మాదిగ నారావారిపల్లెకి వస్తే మారణహోమం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు గిరిధర్ మాదిగ హెచ్చరించారు. నారావారిపల్లె అరుంధతీవాడలో మంగళవారం ఎమ్మార్పీఎస్, టీడీపీ దళిత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
గిరిధర్ మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో ఎమ్మార్పీఎస్ నాయకుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ ఏపీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని, ఆయన సమైక్యాంధ్ర ద్రోహి అన్నారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకోవ డానికి మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్ర మంలో టీడీపీ ఎస్సీ సెల్ నేత తంగరాజు, పీఎస్ రామారావు, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.