Kuppam Assembly Constituency
-
కుప్పం: పెన్షన్ల పంపిణీలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి, చిత్తూరు: ఏపీలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులే లక్ష్యంగా పచ్చ బ్యాచ్‌లు దాడులు చేస్తోంది. తాజాగా కుప్పంలో టీడీపీ శ్రేణుల కారణంగా వైఎస్సార్సీపీ కార్యకర్త కేశవ మృతి చెందాడు.కాగా, కుప్పం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, లబ్ధిదారులైన వైఎస్సార్సీపీ కార్యకర్త కేశవ కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కేశవ తల్లి ప్రమీలకు పెన్షన్ల ఇచ్చేదిలేదని టీడీపీ నేతలు బెదిరించారు. దీంతో, తన తల్లికి పెన్షన్ కోసం కేశవ వారితో వాగ్వాదానికి దిగాడు. ఎట్టకేలకు పంచాయతీ సెక్రటరీ సిబ్భంది సోమవారం సాయంత్రానికి ప్రమీలకు పెన్షన్ అందజేశారు.అయితే, ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కేశవను బెదిరించారు. నీ అంత చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మనస్థాపానికి గురైన కేశవ ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు కేశవను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అతడిని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కేశవ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. -
సీఎం కుప్పం పర్యటన వేళ బది‘లీల’లు
చిత్తూరు, సాక్షి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండ్రోజులపాటు ఈ పర్యటన జరగనుంది. అయితే.. అంతకు ముందే అక్కడి అధికార యంత్రాంగాన్ని మార్చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేపు (మంగళవారం) సీఎం చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ఒకరోజు ముందు.. నియోజకవర్గానికి సంబంధించి పోలీసు అధికారులు ఆఘమేఘాల మీద బదిలీ అయ్యారు. కుప్పం సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు.కుప్పం అర్బన్, రూరల్ సీఐలు రమణ, ఇశ్వర్‌రెడ్డిలను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు. అలాగే కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మికాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబుదుగురు ఎస్ఐ సుమన్‌ను చిత్తూరు వీఆర్‌కు బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన టైంలో జరిగిన ఈ ఆకస్మిక బదిలీలు పోలీస్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పోలీస్ శాఖనే కాదు.. మరికొన్ని విభాగాల్లోనూ ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, నేరుగా సీఎంవో నుంచే సంబంధిత శాఖలకు ఈ ఆదేశాలు అందుతున్నాయని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. .. ఇలాంటి బదిలీలు ఊహించినవే. కానీ, ఇప్పటికే వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ బదిలీల ద్వారా రాబోయే రోజుల్లో మరింత పేట్రేగిపోయే అవకాశం లేకపోలేదని మేధావులు విశ్లేషిస్తున్నారు. -
CBN: టెన్షన్‌తో బాబుకి ముచ్చెమటలు!
ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాలపై ఎంత చర్చ జరుగుతున్నదో, అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాలపై కూడా జరుగుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన గెలుస్తారా?ఓడతారా అన్నది పక్కన పెడితే, ఈ ఎన్నికలలో ఆయనకు ముచ్చెమటలు పట్టాయన్నది మాత్రం వాస్తవం. అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. అందులో ధనబలం కూడా ప్రముఖంగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకు పదివేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడలేదని కొందరు చెబుతున్నారు. వివిద నియోజకవర్గాలలో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేసినా, కుప్పంలో చంద్రబాబు తరపున ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుప్పంలో వరసగా ఏడుసార్లు గెలిచి ఎనిమిదో సారి పోటీచేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే, వెనుకబడిన ప్రాంతం అయిన కుప్పంను ఎంపిక చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఆ విషయంలో సఫలం అవుతున్నారు. అత్యధికంగా బీసీ వర్గాలు ఉండే కుప్పంను ఆయన తన కోటగా మార్చుకున్నారు. అభివృద్ది విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా చంద్రబాబు డబ్బు, దొంగ ఓట్లు ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూ వస్తున్నారు.సరిహద్దులోని తమిళనాడు, కర్నాటక గ్రామాలకు చెందినవారిని కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయంగా లబ్ది పొందేవారని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది. గతంలో వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో వీక్ అభ్యర్ధిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చేసుకునేవారని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది. క్రమేపి ఆయన మెజార్టీని తగ్గించే పనిలో వైఎస్సార్సీపీ పడింది. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఈయనను ఢీకొట్టడానికి సిద్ధం అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. సుమారు 17 వేల దొంగ ఓట్లను ఆయన తొలగించగలిగానని చెప్పేవారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు.తదుపరి ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ అభ్యర్ధి భరత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా, కుప్పం అభివృద్దిపై దృష్టి పెట్టారు. కుప్పంను మున్సిపాలిటీ చేయడం, రెవెన్యూ డివిజన్ చేయడం, స్కూళ్లు బాగు చేయడం, హంద్రీ-నీవా నీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు. వైఎస్సార్సీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అది షాక్ అయింది. దాంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం ఏడాదికి ఒకటి, రెండుసార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. నెల, నెల రావడం ఆరంభించారు. అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు కథ నడిపారు.అదే టైమ్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించడం ఆరంభించారు. దాంతో చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరి ఆడని పరిస్థితి కల్పించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కొద్ది రోజులు అక్కడే ఉండి గడప, గడపకు వెళ్లడం చేశారు. కుప్పంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటివి ఈసారే చేశారు. గతంలో ఆయన తన ప్రతినిధులతో పనులు చేయించేవారు. అలాగే కుప్పం నుంచే కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్‌లోనో, ఉండవల్లిలోనో మాట్లాడి పంపించేవారు. ఆ పరిస్థితి మారి, ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించవలసి వచ్చింది.తనకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని అప్పుడప్పుడు డైలాగులు చెప్పినా, ఆయనకు ఎప్పుడూ అంత ఆధిక్యత రాలేదు సరికదా! క్రమేపి తగ్గుతూ వచ్చింది. 2014లో నలభై ఎనిమిదివేల మెజార్టీ వస్తే 2019లో అది 30 వేలకు తగ్గింది. ఇప్పుడు దొంగ ఓట్లను మరింత తగ్గించగలగడంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. స్థానిక ఎన్నికలలో టీడీపీ కన్నా వైఎస్సార్సీపీకి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే ట్రెండ్ కొనసాగినా, ఆ ఓట్లను ప్రామాణికంగా తీసుకున్నా చంద్రబాబు ఓటమికి గురికాక తప్పదు. స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికల సరళికి కొంత తేడా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆయన శ్రమపడ్డారు. అయినా గెలుస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది.ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ నిత్యం కుప్పంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అండతో అక్కడ నిరంతరం జనంలో తిరుగుతున్నారు. దాంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఆ పార్టీ వాదన. అయితే చంద్రబాబుకు అక్కడ ఉన్న పట్టు అంత తేలికగా పోదని, ఆయా వర్గాలవారిని తనవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు పదివేల రూపాయల వరకు పంచవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పూర్తి అయ్యాక కొన్ని సర్వేలలో చంద్రబాబు ఓడిపోయే అవకాశం కూడా ఉందని వార్తలు రావడం ఆయనకు, టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే.స్థానిక ఎన్నికల తర్వాత ఒక దశలో కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భయపడ్డారు. రిస్కు ఉందని తెలిసినా అక్కడే పోటీ చేయక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అక్కడే ఉంచి రాజకీయం నడిపారు. గతంలో చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందన్న చర్చ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా? లేదా? అనే చర్చ జరగడం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం కానీ, వైఎస్సార్సీపీ కార్యక్రమాలు కానీ సఫలం అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే పెద్ద విజయంగా భావిస్తున్నారు.జగన్ అమలు చేసిన వివిద సంక్షేమ స్కీములు కుప్పంలో కూడా అమలు అయ్యాయి. దానివల్ల సుమారు రెండువేల కోట్ల మేర అక్కడి ప్రజలు లబ్దిపొందారు. కొన్ని వందల మందికి స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కూడా నిర్మించారు. ఆ రకంగా బలహీనవర్గాలను వైఎస్సార్సీపీ బాగానే ఆకట్టుకుంది. దానికితోడు బీసీలలో రెండు బలమైన వర్గాలను వైఎస్సార్సీపీ తనవైపు తిప్పుకోగలిగింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తన హయాంలో జరగని పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుండడం ఆయనకు ఇబ్బందిగా ఉంది. స్థానిక ఎన్నికలలో ఓటమితో నైతికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు దొంగ ఓట్లు కూడా చాలావరకు వైదొలగడం గడ్డుగా మారింది. అయినప్పటికీ ఆయనకు ఉండే క్లౌట్ ఆయనకు ఉండవచ్చు. అందువల్లే చంద్రబాబు ఓడిపోతారని పలువురు చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు ఓడిపోకపోయినా, మెజార్టీ బాగా తగ్గిపోతుందని అంచనాలు ఉన్నాయి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మాటిచ్చా.. నిలబెట్టుకున్నా: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: మాటిస్తే.. నిలబెట్టుకునే తత్వం ఆయనది. ఇవాళ కూడా అదే జరిగింది. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చంద్రబాబు సొంత ప్రాంతానికి మంచి నీళ్లను తేలేపోయారు. కానీ, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందుకే ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించామంటూ సంతోషంతో ట్వీట్ చేశారాయాన. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకువచ్చాం. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను. నేడు ఆ మాటను నిలబెట్టుకున్నాను. ఇంత దూరాన్ని దాటుకుని, ఏకంగా 1,600 అడుగులు పైకెక్కి నేడు కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఈ కృష్ణా జలాలను నిల్వ చేసేలా 1 టీఎంసీ సామర్థ్యంతో రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లను, 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.215 కోట్లతో పాలార్ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి, మరోసారి ఏర్పడబోయే మన ప్రభుత్వంలో అందుబాటులోకి తీసుకొస్తాం అని సీఎం జగన్ పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి నీరందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించాం. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకువచ్చాం. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో మాట్లాడుతూ ఈ… pic.twitter.com/pRrCz0Y97I — YS Jagan Mohan Reddy (@ysjagan) February 26, 2024 -
ఇంత కాలం బాబును భరించిన కుప్పం ప్రజలకు జోహార్లు: సీఎం జగన్
సాక్షి, కుప్పం/శాంతిపురం: టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. ఆయన వల్ల మంచి జరిగిందా?.. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కుప్పంలోని శాంతిపురం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘2022లో కుప్పంకు వచ్చినప్పుడు కృష్ణా నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా జలాలను సగర్వంగా కుప్పంకు తీసుకువచ్చాం. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయి. కుప్పుం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పిన చేసి చూపించాం. చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు. చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా?. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మంచి జరిగిందా. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది మీ జగన్. చిత్తూరు పాల డెయిరీని పున:ప్రారంభించింది మీ జగన్. కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం. కుప్పంలో కేవలం 31వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్షన్ ఇచ్చారు. మన ప్రభుత్వంలో రూ.3వేలకు పెన్షన్ పెంచి 45974 మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పెన్షన్ అందిస్తున్నాం. కుప్పంలో 44640 మంది రైతులకు రూ.241 కోట్లు రైతు భరోసా ఇచ్చాం. చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు. కుప్పం నియోజకవర్గంలో 1400 మంది వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. కుప్పంలో 76 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్రంలో రూ.26వేల కోట్లు అందించాం. కుప్పంలో 44888 మహిళలకు రూ.172 కోట్లు ఇచ్చాం. కుప్పంలో 35951 మంది తల్లులకు జగనన్న అమ్మఒడి ఇచ్చాం. కుప్పంలో 15727 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈనెలలో మరో 15వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నాం. కుప్పంలో 93 శాతం ప్రజలకు మన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. వైఎస్సార్ చేయూత ద్వారా 19921 మందికి రూ.85కోట్లు ఇచ్చాం. నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింపచేశాం. కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17552 మందికి ఆరోగ్య సేవలు అందించాం. కుప్పంలో కొత్తగా 108 వాహనాలను అందించాం. కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా?. చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కూడా కట్టుకోలేదు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా?. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా?. మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు?. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి. రంగాను హత్య చేయించింది చంద్రబాబే కదా. ఇప్పుడు వైఎస్సార్సీపీ తరఫున భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి. భరత్ గెలిచిన తర్వాత మంత్రి చేస్తాం. కుప్పాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు. సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసింది. కృష్ణా జలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టాం. అందుకోసం పరిపాలనపరమైన అనుమతులు కూడా ఇచ్చాం. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతాం. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో కుప్పంకు సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తున్నాం. 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. ఈ 35 ఏళ్ల కాలంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు. కుప్పంకు ప్రయోజనంలేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం. కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు నిధులు పారే ప్రాజెక్ట్‌గా చేసుకున్నారు. ప్రాజెక్ట్ అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు. వెల్లూరు మెడికల్ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా చేసింది చంద్రబాబు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని అందించాం. కుప్పం ప్రజలంతా మావాళ్లేనని గర్వంగా చెబుతున్నాను. చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడు నన్ను, సీమను తిడుతూ ఉంటాడు. నేను ఏనాడు కుప్పంను, ఇక్కడి ప్రజలను ఒక్క మాట కూడా అనలేదు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం. ప్రతీనెలా ఇంటికే వచ్చి వలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు. చంద్రబాబు హయంలో అరకొర ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతీ విద్యార్థికి వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరూ మిస్ అవకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం. ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకు?’ అని ప్రశ్నించారు. -
ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్‌బై?
చిత్తూరు, సాక్షి: ఏపీలో రాజకీయాలు ఊహించిన దానికంటే శరవేగంగా మారుతున్నాయి.. ఒక్క పొత్తులో సీట్ల పంపకం విషయంలో తప్ప!. తాజాగా కుప్పం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేయడానికే జంకుతున్నారనే చర్చ నడుమ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఆయన రాష్ట్ర రాజకీయాలకే పూర్తిగా దూరం అవుతారనే టాక్ ఒకటి నడుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. టీడీపీకి, చంద్రబాబు నాయుడికి కంచుకోటలా ఉంటూ వస్తోంది. 1989 నుంచి వరుసగా ఏడుసార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు నెగ్గుతూ వచ్చారు. అయితే ఈసారి మారిన రాజకీయ సమీకరణాలు ఆయనలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కుప్పంలో ఓడిపోతానని భయం ఆయనకు పట్టుకుంది. అందుకు కారణం.. సీఎం జగన్ ఈ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిసారించడం. దీంతో.. ఆయన మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే పెనమలూరు స్థానం. కృష్ణా జిల్లా పెనమలూరు స్థానంలో 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ నెగ్గాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో సాగిన జన ప్రభంజనంతో వైఎస్సార్సీపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు.. మిగతా నియోజకవర్గాల్లో మాదిరే ఇక్కడా టీడీపీలో వర్గపోరు ఉన్నా.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్‌కే టికెట్ కేటాయిస్తారంటూ తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఈ స్థానంపై కన్నేసినట్లు సమాచారం. నాయుడుగారూ.. ఇంకెన్నిరోజులు?: ఢిల్లీ అధిష్టానం! పొలిటికల్ సర్కిల్స్ సమాచారం మేరకు.. బీజేపీతో పొత్తుల చర్చల కోసం టీడీపీ అధినేత మొన్నామధ్య ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడి అధిష్టానం ఆయన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఏపీలో టీడీపీ గెలిచే పరిస్థితులు లేవు. మీ వయసు డెబ్భై ఏళ్లు దాటింది. ఇంకెంత కాలం కష్టపడుతారు. పైగా అవినీతి కేసులు చుట్టుముట్టాయి. ఇలాంటి టైంలో వయసురిత్యా రాష్ట్ర రాజకీయాలకు స్వచ్ఛందంగా దూరం జరగండి. కావాలంటే జాతీయ రాజకీయాల వైపు రండి’’ ఆయనకు ఢిల్లీ పెద్దలు సూచించారట. శరద్ పవార్, దేవగౌడ.. ఇలా వయసు మళ్లిన కొందరు నేతల పేర్లను సైతం ఉదాహరించినట్లు కూడా తెలుస్తోంది. అందుకే కుప్పం నుంచి ప్యాకప్ చేసుకోవడంతో పాటు పూర్తిగా.. ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్‌బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతటి అవమానం కంటే ముందు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావిస్తున్నారట!. పెనమలూరులో పోటీ కోసం చంద్రబాబు నాయుడు తొలి నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో టీడీపీ అభిమానులు ఎక్కువే. పైగా పెనమలూరు సెగ్మెంట్లో కమ్మ వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం కూడా చంద్రబాబు ఆసక్తికి మరో కారణంగా స్పష్టమవుతోంది. కానీ, ఆ విషయాన్ని బయటపడనివ్వలేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. వర్గ పోరు మరీ ఎక్కువగా ఉంది. అందుకే బోడే ప్రసాద్‌ను ఆ వరుసలో ముందు నిల్చోబెట్టారు. చివరకు ఐవీఆర్ఎస్ సర్వేలో వ్యతిరేక ఫలితం వచ్చిందని చెబుతూ బోడేను పక్కన పెట్టేశారు. ఇక్కడా చంద్రబాబు తన వెన్నుపోటు బుద్ధిని ప్రదర్శించారు. స్కిల్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో.. బోడే తనకు సంఘీభావంగా దీక్ష సైతం చేపట్టిన సంగతిని సైతం చంద్రబాబు విస్మరించారు. -
చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి?
సాక్షి, చిత్తూరు: కుప్పం నుంచి పారిపోయే యోచనలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లలో సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారాయన. కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. తన మన పార్టీ భేదాలు లేకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేద్దామనుకుంటున్నానని బహిరంగ సభలో ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం రూపురేఖల్ని మార్చేశారు, భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది. తాజాగా.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కుప్పం నుంచి పోటీకి ఆసక్తికనబరుస్తూ నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో 35 ఏళ్ల నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారామె. బహిరంగ సభలో భువనేశ్వరీ ఏమన్నారంటే.. "కుప్పంకు వచ్చాను.. ఇక్కడ నాకొక కోరిక ఉంది నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది (సభకు వచ్చిన వారిని ఉద్దేశిస్తూ..) నేనేమి మిమ్మల్ని కొట్టను.. తిట్టను 35ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు నాకొక కోరిక ఉంది ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నా నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా" చంద్రబాబు అస్త్ర సన్యాసం.!? భువనేశ్వరీ చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రకటనగా చూడాలి. చాలా కాలంగా చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. సరిగా ఎన్నికలకు రెండు నెలల ముందు భార్య భువనేశ్వరీతో ప్రకటన చేయించాడని భావిస్తున్నారు. పైగా భువనేశ్వరీ మాటల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు విశ్రాంతి కావాలని చెబుతున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో రోగాలున్నాయని కోర్టుకు నివేదిక రూపంలో ఇచ్చారు. అసలే అనారోగ్యం.. ఆపై వయస్సు మీద పడడం.. చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. వృద్ధాప్యం పెరగడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడుకు లోకేష్‌ను ఎంత ఎంకరేజ్ చేసినా.. ఫలితం లేకపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకోవడం మేలని టిడిపిలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తప్పుకోవడానికి కారణమేంటీ? కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి. నాలుగు చోట్ల YSRCP గెలిచింది కుప్పం నగర పంచాయతీలో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 చోట్ల YSRCP గెలిచింది కుప్పంలో వరుస ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా తప్పుకోవడం మేలని భావిస్తున్నారు కుప్పం పట్టణాన్ని చంద్రబాబు హయాంలో మున్సిపాలిటీ చేయలేదు. 2019 తర్వాత సీఎం జగన్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అయింది కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్‌ను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. గత ఏడాది సీఎం జగన్ వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు కుప్పంలో తాగునీటి సమస్యకు చంద్రబాబు పరిష్కారం చూపించలేదు. ఈ పనులను సీఎం జగన్ పూర్తి చేయించి ఈ నెలలో పరిష్కారం కల్పిస్తున్నారు కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపు అత్యంత కీలకమైన విషయం. ఏకంగా 30వేల దొంగ ఓట్లు ఉన్నట్టు వైఎస్సార్సిపి ఫిర్యాదు చేసింది. వీటిని ఎన్నికల సంఘం తొలగించడంతో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అత్యంత ప్రతికూలతలున్న ప్రస్తుత సమయంలో తాను పోటీ చేసి ఓడిపోవడం సరికాదన్న ఆలోచనలో బాబు ఉన్నారు భరత్, కుప్పం YSRCP ఇన్ఛార్జ్ "అన్ని స్థానిక సంస్థల్లో YSRCP విజయం సాధించింది. తాజా సర్వేల్లో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమయింది. ఎలాగూ ఓడిపోతానని తేలిపోవడంతో చంద్రబాబు పలాయనవాదం ఎంచుకున్నట్టుంది. అందుకే భువనేశ్వరీతో ఎన్నికల ముందు ఈ ప్రకటన చేయించాడు. చంద్రబాబు హయాంలో కుప్పంలో పార్టీ వివక్ష వీపరీతంగా సాగింది. టిడిపికి చెందిన వాళ్లకు మాత్రమే పనులు జరిగాయి. 2019 తర్వాత ప్రజలు స్పష్టమైన మార్పు చూస్తున్నారు. అర్హులైన వారు ఏ పార్టీ అయినా సంక్షేమం అందింది. జగన్ రూపంలో గొప్ప నాయకత్వాన్ని చూశారు. ఓటమి కళ్ల ముందు కనబడడంతో చంద్రబాబు ముందే కుప్పం నుంచి పారిపోతున్నారు." చంద్రబాబు కింకర్తవ్యం.!? చంద్రబాబు గత కొన్నాళ్లుగా పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారు. కుప్పంలో ఎలాగూ గెలవలేను కాబట్టి .. తన సామాజిక వర్గం అంటే కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉన్న పెనమలూరు అయితే తనకు సేఫ్ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత విశాఖ అనుకున్నా.. అక్కడ గెలిచే అవకాశం లేదని పార్టీ సర్వేల్లో తేలింది. దీంతో కుప్పంను వదిలిపెట్టి పెనమలూరులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు. 2019లో పెనమలూరులో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. ఇక్కడ గెలిచిన పార్థసారథిని తెర వెనక ఏం చేశారో కానీ తనవైపునకు తిప్పుకున్నారు చంద్రబాబు. భువనేశ్వరీ ప్రకటనను ఎలా చూడాలి? భువనేశ్వరీ ప్రకటన సరదా కామెంట్ కాదు భువనేశ్వరీ ఏ సభలో ఎలా మాట్లాడాలి అన్నది పక్కగా స్క్రిప్టింగ్ చేస్తారు ముందే ఏం చేయాలి.? ఎలా ప్రకటనలు చేయాలి అన్నదానిపై శిక్షణ ఇస్తారు కార్పోరేట్లో ఉండడం వేరు, ప్రజల్లోకి రావడం వేరు కాబట్టి భువనేశ్వరీ విషయంలో పార్టీ అంత జాగ్రత్త తీసుకుంటారు శిక్షణ కోసమే నిజం గెలవాలి యాత్రను వెంట వెంటనే కాకుండా.. బ్రేకులిస్తూ తీసుకెళ్తున్నారు అంటే భువనేశ్వరీ మాట్లాడే ప్రతీ మాటకు చంద్రబాబు డైరెక్షన్ ఉంటుంది చంద్రబాబు ఒక విషయాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి చేసిన ప్రయత్నం ఇది కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే.. అసలుకే మోసం వస్తుందన్న భయం కుప్పం సేఫ్ సీటు కాదు కాబట్టి ముందే భార్యతో చెప్పించడం రెండు నియోజకవర్గాలు అనుకున్నా.. రెండింటా ఓడిపోతే ఎలా అన్న భయాలు తెలంగాణలోనూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు (ఈటల రెండు చోట్లు, రేవంత్, కేసిఆర్ ఒక్కో చోట) చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేనప్పుడు పార్టీని ఏం నడిపిస్తాడు? భువనేశ్వరీ ద్వారా చంద్రబాబే ఒక ఫీలర్ వదిలారు ముందుగా భువనేశ్వరీతో చెప్పించి, ఆ తర్వాత ఓ పార్టీ ప్రకటన చేయించే ఆలోచన చంద్రబాబుది ఇప్పటికీ పొత్తులపైనే నమ్మకం తప్ప.. ఇది చేస్తానని, ఇది చేశానని బలంగా చెప్పుకోలేని చంద్రబాబుకు రిటైర్మెంట్ టైం వచ్చింది భువనేశ్వరీ ప్రకటన చూస్తుంటే ఇది చంద్రబాబు అస్త్ర సన్యాసమే -
నీలాగా వెన్నుపోటు పొడిచానా?.. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, పుంగనూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చౌకబారు విమర్శలకు దిగారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు మితిమీరి నాపై విమర్శలు చేస్తున్నాడు. నీ లాగా నేను మామకు వెన్నుపోటు పొడిచానా?. చంద్రబాబు నువ్వు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ, నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావ్?. ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు బాబు షూరిటీ.. భవిషత్తు గ్యారంటీ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను గద్దె దింపగానే మద్యపాన నిషేదం ఎత్తివేశారు, రెండు రూపాయల కిలో బియ్యం తీసేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా?. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టీ టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారు. పేదరికాన్ని కొలబద్దగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం జగన్ మాత్రమే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పథకాల అమలుపై సీఎం జగన్ దృష్టి సారించారు. చంద్రబాబు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారు. చంద్రబాబు మోసకారి మాటలు నమ్మవద్దు.. అధికారంలోకి రాలేము అని దూషణలు మొదలు పెట్టారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. నువ్వు వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డపేరు తెచ్చావు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: జనసేన –టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేనే పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం అంతకన్నా హాస్యాస్పదమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ, ఒక్క రాజోలులోనే జనసేన గెలిచింది. అలాంటి రాజోలు స్థానంలో జనసేన పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరం నియోజకవర్గాన్ని టీడీపీ ఇప్పటికే జనసేనకు వదిలేసింది. పవన్ పోటీ చేస్తున్నట్లు చెప్పింది కూడా ఈ రెండు నియోజకవర్గాలే. ఇక్కడే డ్రామా మొత్తం బయటపడిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు. మండపేట, అరకు నియోజకవర్గాలకు చంద్రబాబు ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడానికి కౌంటర్‌గా, గుణపాఠం చెబుతున్నట్లుగా పవన్ ఈ ప్రకటన చేయలేదన్నది సుస్పష్టమని అంటున్నారు. కేవలం పార్టీ నేతలు, అభిమానుల ముందు బిల్డప్ ఇవ్వడానికే పవన్ రెండు నియోజకవర్గాలపై ఈ హాస్యాస్పద ప్రకటన చేశారని, దీని వెనుకా చంద్రబాబే ఉన్నారని రాజకీయ పరిశీలకులు, జనసేన నేతలు కూడా చెబుతున్నారు. టీడీపీ – జనసేనల మధ్య పొత్తు ఖరారై నాలుగు నెలలు దాటింగి. ఇప్పుటికీ రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ సాగుతూనే ఉంది. సీట్ల కేటాయింపుపై బాబు–పవన్ ఉమ్మడిగా ప్రకటన చేయాలని ఇప్పటికి రెండుసార్లు నిర్ణయించి, విఫలమయ్యారు. ఇంకో పక్క మా సీటు మీరెలా అడుగుతారంటూ నియోజకవర్గాల్లో టీడీపీ –జనసేన నాయకులు గొడవలు పడుతున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలకపోయినప్పటకీ మండపేట, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్టు ఆ రెండు చోట్లా సభలు పెట్టి మరీ చెప్పారు. అభ్యర్థులను కూడా ఆ సభల్లోనే ప్రకటించారు. బాబు తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా మండపేట నేతలు పవన్‌ను కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ శుక్రవారం నాటి ప్రకటన చేశారని చర్చ సాగుతోంది. సీట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం, టీడీపీ ఏకపక్ష వైఖరి కారణంగా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దస్థాయిలో నెలకొన్న విభేదాలను తగ్గించి, అన్ని చోట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేన ఓట్లు టీడీపీకి బదలాయించడం కోసమే బాబు, పవన్ వ్యూహాత్మకంగా ఈ నాటకాన్ని మొదలుపెట్టి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. దీనికి ‘టిట్ ఫర్ టాట్’గా కలరింగ్ ఇవ్వడం ఆ ఇద్దరికే చెల్లిందంటున్నారు. పొత్తులకు ఎన్నెన్ని ఎత్తులో.. నమ్మించి నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును పవన్ విశ్వసిస్తున్నారని జనసేన నేతలూ నమ్మడంలేదు. పొత్తుల కోసం మొదటి నుంచి వెంపర్లాడుతూ మరోవైపు అలాంటిదేమీ లేదన్నట్లు బాబు, పవన్ చెబుతూ వచ్చారు. ఈ డ్రామాను ఇరు పారీ్టల వారితో పాటు రాష్ట్ర ప్రజలూ ఏ దశలోనూ విశ్వసించలేదు. ఈ దశలోనే స్కిల్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ములాఖత్ మాటున పవన్ పొత్తు ప్రకటనా నాటకమన్న విషయం అప్పట్లోనే తేటతెల్లమైంది. బాబు అరెస్టుతో టీడీపీ పనైపోయిందని, పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ అత్యధిక సంఖ్యలో సీట్లను కేటాయించే అవకాశం ఉందని నమ్మి ఆ పార్టీ నాయకులు కూడా కలిసిపోయేందుకు రెడీ అయ్యారు. జనసేన 68 సీట్లను టీడీపీ ముందు ప్రతిపాదించి, కనీసం 45 స్థానాల్లో పోటీ చేయాలని ఆశపడుతోంది. అందులో సగం సీట్లు కూడా జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదని చర్చ సాగుతోంది. క్రమంగా టీడీపీ ముసుగు తొలగి, మోసపూరిత వైఖరి బయట పడుతుండటంతో జనసేన నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారంతా చంద్రబాబు, టీడీపీ మోసపూరిత వైఖరి గురించి మాట్లాడుతుంటే.. జనసేన అధినేత పవన్ మాత్రం సర్దుకుపోవాలన్న మాటలే వినిపిస్తున్నారు. పొత్తులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా జనసేన సర్దుకపోవాల్సిందేనని, భరించాల్సిందేనని సొంత పార్టీ నేతలకు పదేపదే చెబుతున్నారు. శుక్రవారంనాటి సమావేశంలోనూ.. ముందుగా రెండు నియోజకవర్గాలపై ఓ బిల్డప్ ప్రకటన చేసి, చివరికి వచ్చేసరికి సర్దుకుపోవాల్సిందేనన్న టీడీపీ సందేశాన్నే ఇచ్చారు. సీట్ల కేటాయింపు తేలక మునుపే చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్ధులను ప్రకటించడంపై సొంత పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతూనే.. వాళ్ల పార్టీలో ఉన్న పరిస్థితిని మనమే అర్ధం చేసుకోవాలంటూ చంద్రబాబుకు వంతపాడారు. సీఎం పదవి లేదన్నలోకేశ్కూ జీ హుజూరే! టీడీపీ –జనసేన పొత్తు ఉన్నప్పటికీ, సీఎం పదవిలో పవన్ కళ్యాణ్‌కు వాటా లేదంటూ గతంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీహుజూర్ అనేశారు. నెల కిత్రం లోకేశ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలా స్పష్టంగా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ (రెండో మాటే లేదు)’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పారీ్టలో పెద్ద దుమారమే రేగింది. ఇన్నాళ్లూ దానిపై ఒక్కసారి కూడా మాట్లాడని పవన్.. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనస్సుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024లో జగన్ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటన్నింటికీ నన్ను చాలా సార్లు రెస్పాండ్ కానీయకుండా చేస్తోందంటూ వంకలు చెప్పారు. ఎమ్మెల్యే సీట్లను పక్కనపెట్టి.. వార్డు పదవుల వాటా చర్చ రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందా అని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే.. పవన్ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిన్ని సీట్లు వస్తాయంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లెన్ని వస్తాయో చెప్పకుండా.. ఈ ఎన్నికల తర్వాత కామన్ పొలిటికల్ ప్రోగ్రాం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పోరేషన్ వరకు జనసేన ఖచి్చతంగా మూడో వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే సీట్ల దగ్గర తాను ఆగిపోవడం లేదంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఏమిటో తెలిసిన జనసేన నేతలు పవన్ మాటలను నమ్మడంలేదు. ఇదంతా అసెంబ్లీ సీట్ల కేటాయింపుల వ్యవహారం నుంచి జనసేన నేతలు, అభిమానులను పక్కదారి పట్టించే ప్రయత్నమేనని, చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు. చివరివరకు ఇలా సాగదీసి, ఎన్నికల ముంగిట్లో ఓ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు విదిలిస్తారన్నది సుస్పష్టమని చెబుతున్నారు. కేవలం జనసేన ఓట్లు టీడీపీకి పడటానికే చంద్రబాబు ఇలా జనసేన నేతలు, అభిమానులకు పవన్‌తో చెప్పిస్తున్నారని విశ్లేíÙస్తున్నారు. -
కుప్పంలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదా?
ఏడుసార్లు అందలం ఎక్కించిన కుప్పం ప్రజలు ఈసారి ఓడించి హైదరాబాద్‌కే పరిమితం చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారా? ఓటమి భయంతోనే కుప్పంతో పాటు మరో నియోజకవర్గం కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారా? 35 ఏళ్ళపాటు ఏకధాటిగా ఎన్నుకున్నా పట్టించుకోనందుకు కుప్పం ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారా? కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందన్న భయంతోనే బలమైన సీటు కోసం వేట ప్రారంభించారా? అసలు కుప్పంలో ఏం జరుగుతోంది? 1983 ఎన్నికల్లో తన సొంత నియోజక వర్గం చంద్రగిరిలో ఘోర పరాజయం పొందిన చంద్రబాబు నాయుడు.. 1989 ఎన్నికల నాటికి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇపుడు ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారా అంటూ కామెడీ చేస్తోన్న చంద్రబాబు మూడున్నర దశాబ్ధాల క్రితమే చంద్రగిరి నుంచి కుప్పం నియోజక వర్గానికి బదలీ అయిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన నియోజక వర్గంగా కుప్పాన్ని మూడున్నర దశాబ్ధాల పాటు చంద్రబాబు తన స్వప్రయోజనాలకే వాడుకున్నారు. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయినా కుప్పం నియోజక వర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే కుప్పం ప్రజలు ఉపాధిలేక ఉస్సూరు మంటూ ఉండేవారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం లో సంక్షేమ పథకాల అమలుతో దాని ముఖచిత్రం మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల్లోనే అధికారం ఉన్నప్పుడు ఆయన కుప్పానికి ఏమీ చేయలేదు. కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయలేదు. రెవిన్యూ డివిజన్‌గా చేసుకోలేకపోయారు. హంద్రీ నీవా నీళ్లు కుప్పం వరకు తేలేకపోయారు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుప్పం నియోజక వర్గం తలరాత మారిందని చెప్పాలి. ముందుగా మున్సిపాలిటీని చేశారు. ఆ వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు. కుప్పం కాలువలకు హంద్రీ నీవా ద్వారా నీటిని అందించే బృహత్ పథకం కూడా సాకారం చేశారు జగన్మోహన్రెడ్డి. ఫలితంగా నియోజక వర్గంలోని 44 కాలువలు జలకళతో మెరవనున్నాయి. ఇక నవరత్న పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్నారు జగన్మోహన్రెడ్డి. ఈ మార్పు కారణంగానే కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపారు. పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ అభ్యర్ధులను గెలిపించారు కుప్పం ప్రజలు. ఈ వరుస ఓటముల కారణంగానే చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. అంత వరకు కుప్పానికి చుట్టపు చూపుగా కూడా రాని చంద్రబాబు ఏడాదిలో మూడు సార్లు కుప్పం వచ్చి రెండు మూడు రోజులు గడిపి వెళ్తున్నారు. ఇంత వరకు కుప్పంలో ఇల్లుకూడా కట్టుకోని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయాల తర్వాతనే నియోజక వర్గంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. కేవలం ఎన్నికల్లో ఓట్లకోసమే చంద్రబాబు ఇలా డ్రామాలు చేస్తున్నారని నియోజక వర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలోనూ వైఎస్సార్సీపీజెండా ఎగరేస్తామని పాలక పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. కుప్పాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వై నాట్ 175 అన్ని నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు కుప్పం నియోజక వర్గంలో ఎన్ని అక్రమాలు జరిగినా దొంగ ఓట్ల వ్యవహారాలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్రెడ్డి అన్నీ పకడ్బందీగా చూస్తూ ఉండడంతో చంద్రబాబుకు కస్టాలు తప్పేలా లేవంటున్నారు మేథావులు. కుప్పం ప్రజలపై కానీ.. కుప్పంలోని టిడిపి నాయకులపై కానీ చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకే నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. దీనిపైనా టిడిపి శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడినా ఓడిపోవచ్చని గ్రహించిన చంద్రబాబు ఎన్టీయార్ కృష్ణా జిల్లాలో ఏదైనా బలమైన నియోజక వర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబులో భయం అయితే తీవ్ర స్థాయిలో ఉందన్నది భయంకర వాస్తవం. -
టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి!
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి వీస్తోంది. కుప్పం ప్రజలు.. చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్‌వారే ఇందుకు కారణమని సమాచారం. ఇక, తాజాగా కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినా ఉపయోగం లేదని అటు సర్వేలు కూడా చెబుతున్నాయి. తాజా సర్వేతో కుప్పం టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇక, ఇటీవల చంద్రబాబు పర్యటనలో అలవికాని హామీలిచ్చి మోసం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు, 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంకు సాగునీరు, తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల హడావిడిగా శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుప్పం టీడీపీలో గ్రూప్ రాజకీయాలతో చంద్రబాబుకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కుప్పం ఇంఛార్జిగా తెలుగు తమ్ముళ్లు అంగీకరించడం లేదు. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం కుప్పంను చాలా అభివృద్ధి చేశారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కుప్పంకు ఈ నెలలోనే హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగు నీరు జాలాలు తెచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక, టీడీపీకి చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. చిత్తూరు, జీడి నెల్లూరు, పూతల పట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సరైన అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో, సర్వేల్లో కూడా టీడీపీ తప్పదని నివేదికలు చెబుతున్నాయి.