సాక్షి, చిత్తూరు: ఏపీలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులే లక్ష్యంగా పచ్చ బ్యాచ్‌లు దాడులు చేస్తోంది. తాజాగా కుప్పంలో టీడీపీ శ్రేణుల కారణంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త కేశవ మృతి చెందాడు.
కాగా, కుప్పం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, లబ్ధిదారులైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కేశవ కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కేశవ తల్లి ప్రమీలకు పెన్షన్ల ఇచ్చేదిలేదని టీడీపీ నేతలు బెదిరించారు. దీంతో, తన తల్లికి పెన్షన్ కోసం కేశవ వారితో వాగ్వాదానికి దిగాడు. ఎట్టకేలకు పంచాయతీ సెక్రటరీ సిబ్భంది సోమవారం సాయంత్రానికి ప్రమీలకు పెన్షన్ అందజేశారు.
అయితే, ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కేశవను బెదిరించారు. నీ అంత చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మనస్థాపానికి గురైన కేశవ ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు కేశవను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అతడిని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కేశవ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment