మాటిచ్చా.. నిలబెట్టుకున్నా: సీఎం జగన్‌ | CM Jagan Emotional Tweet About Kuppam Promise | Sakshi
Sakshi News home page

మాటిచ్చా.. నిలబెట్టుకున్నా: సీఎం జగన్‌

Feb 26 2024 8:54 PM | Updated on Feb 26 2024 8:54 PM

CM Jagan Emotional Tweet About Kuppam Promise - Sakshi

గుంటూరు, సాక్షి: మాటిస్తే.. నిలబెట్టుకునే తత్వం ఆయనది. ఇవాళ కూడా అదే జరిగింది. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చంద్రబాబు సొంత ప్రాంతానికి మంచి నీళ్లను తేలేపోయారు. కానీ, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించామంటూ సంతోషంతో ట్వీట్‌ చేశారాయాన. 

హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకువచ్చాం. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను. నేడు ఆ మాటను నిలబెట్టుకున్నాను. ఇంత దూరాన్ని దాటుకుని, ఏకంగా 1,600 అడుగులు పైకెక్కి నేడు కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని చెప్పేందుకు గర్వపడుతున్నాను.

ఈ కృష్ణా జలాలను నిల్వ చేసేలా 1 టీఎంసీ సామర్థ్యంతో రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లను, 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.215 కోట్లతో పాలార్ ప్రాజెక్ట్ను పూర్తిచేసి, మరోసారి ఏర్పడబోయే మన ప్రభుత్వంలో అందుబాటులోకి తీసుకొస్తాం అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement