Krishna water pipeline
-
మాటిచ్చా.. నిలబెట్టుకున్నా: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: మాటిస్తే.. నిలబెట్టుకునే తత్వం ఆయనది. ఇవాళ కూడా అదే జరిగింది. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. 14 ఏళ్లు సీఎంగా చేసినా కూడా చంద్రబాబు సొంత ప్రాంతానికి మంచి నీళ్లను తేలేపోయారు. కానీ, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందుకే ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించామంటూ సంతోషంతో ట్వీట్ చేశారాయాన. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకువచ్చాం. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొస్తానని మాటిచ్చాను. నేడు ఆ మాటను నిలబెట్టుకున్నాను. ఇంత దూరాన్ని దాటుకుని, ఏకంగా 1,600 అడుగులు పైకెక్కి నేడు కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఈ కృష్ణా జలాలను నిల్వ చేసేలా 1 టీఎంసీ సామర్థ్యంతో రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లను, 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.215 కోట్లతో పాలార్ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి, మరోసారి ఏర్పడబోయే మన ప్రభుత్వంలో అందుబాటులోకి తీసుకొస్తాం అని సీఎం జగన్ పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి నీరందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని నేడు మన ప్రభుత్వంలో నిర్వహించాం. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నది నీటిని కుప్పానికి తీసుకువచ్చాం. 2022 సెప్టెంబర్ 23న ఇదే కుప్పంలో మాట్లాడుతూ ఈ… pic.twitter.com/pRrCz0Y97I — YS Jagan Mohan Reddy (@ysjagan) February 26, 2024 -
కరువు నేలలో కృష్ణమ్మ పరుగులు
వర్షం పడితేనే పంటలు పండే నేలలో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. కృష్ణమ్మ జల స్పర్శతో చెరువులు సైతం పులకించనున్నాయి. ఇందుకోసం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో త్వరలోనే రైతుల కల సాకారం కానుంది. కృష్ణగిరి(కర్నూలు): జిల్లాలోని çపత్తికొండ, డోన్, ఆలూరు, కర్నూలు నియోజకవర్గాలకు గతంలో సాగునీటి వనరులు తక్కువగా ఉండేవి. వరుణుడి కరుణతోనే పంటలు పండేవి. ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని కృష్ణా జలాలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తరలించేందుకు 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా కృష్ణాజలాలను చిత్తూరు జిల్లా వరకు తీసుకెళ్లేలా నిధులు మంజూరు చేసి పనులు సైతం పూర్తి చేయించారు. 2014 ఎన్నికల కంటే ముందుగానే కాలువకు నీరు విడుదల చేసి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్‌కు అప్పటి మంత్రులు పాదయాత్ర చేపట్టారు. జిల్లాలో ఏడు ఎత్తిపోతల పథకాలు, రెండు రిజర్వాయర్లతోపాటు రెండు చానల్ కాల్వల ద్వారా 80వేల ఎకరాలకు అధికారికంగా సాగునీరు ఇస్తున్నారు. ఇదంతా దివంగత నేత వైఎస్సార్ పుణ్యమే అని ఇక్కడి ప్రజలు నిత్యం స్మరించుకుంటున్నారు. 68 చెరువులకు హంద్రీ–నీవా నీరు హంద్రీ–నీవా ప్రాజెక్టుతో బీడు భూములను వైఎస్సార్ సస్యశ్యామలం చేయిస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి హంద్రీ–నీవా ప్రధాన కాల్వ నుంచి 68 చెరువులకు నీరు మళ్లించే పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ సమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ 90 కి.మీ దగ్గర పంప్‌హౌస్ నిర్మించారు. ఇందులో 3,800 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్ల నుంచి కటారుకొండ పంచాయతీ పరిధిలోని పులిచెర్ల సమీపంలో డెలివరీ చాంబర్‌కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి మూడు ౖపైపుల ద్వారా నీరు చెరువులకు మళ్లించనున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలతోపాటు డోన్, ప్యాపిలి, కల్లూరు, దేవనకొండ మండలాల్లోని 68 చెరువులకు పైపుల ద్వారా నీరు వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 186 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 160 కోట్లు ఖర్చు చేసింది. పంటలు పూర్తయిన వెంటనే డిస్ట్రిబ్యూటరీ పనులు కృష్ణగిరి మండల పరిధిలోని పులిచెర్ల కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి మూడు గ్రావిటీల ద్వారా చెరువులకు నీరు మళ్లించే మెయిన్ పైప్‌లైన్ పనులు 80 శాతానికిపైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ పంటలు ఉండటంతో డిస్ట్రిబ్యూటరీ పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. పంట కాలం పూర్తయిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని అనుమతులు వచ్చాయి 68 చెరువులకు నీరు మళ్లించే పథకానికి సంబంధించి అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా ఉండేవి. అయితే ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చాయి. మెయిన్ పైప్‌లైన్ దాదాపుగా 80 శాతానికిపైగా పూర్తి చేశాం. డిస్ట్రిబ్యూటరీలు కొన్ని చేపట్టాల్సి ఉంది. పొలాల్లో రైతులు పంటలు తీస్తే ఆ పనులు కూడా త్వరగా పూర్తి చేస్తాం. డిసెంబర్ నాటికి 30 చెరువులకు పైగా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణరెడ్డి, ఇరిగేషన్ ఈఈ మూడు గ్రావిటీలు ఇవే.. గ్రావిటీ–1: పులిచెర్ల సమీపంలోని కొండపై ఏర్పాటు చేసిన డెలివరీ చాంబర్ నుంచి 41.52 కిలోమీటర్ల దూరం ప్రయాణించి డోన్, వెల్దుర్తి, కల్లూరు, కృష్ణగిరి మండలాల్లోని 22 చెరువులకు నీరు చేరుకుంటుంది. 4,217ఎకరాలకు నీరు అందనుంది. గ్రావిటీ–2: డెలివరీ చాంబర్ నుంచి నీరు 21.20 కిలోమీటర్లు ప్రయాణించి పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల్లోని 16 చెరువులకు చేరుతుంది. మొత్తం 3,018 ఎకరాలకు నీరు పారనుంది. గ్రావిటీ–3: డెలివరీ చాంబర్ నుంచి నీరు 38 కిలోమీటర్లు దూరం ప్రయాణించి డోన్, ప్యాపిలి, తుగ్గలి మండలాల్లోని 30 చెరువులకు చేరుతుంది. ఆయా మండలాల్లో 2,898 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ట్రయల్ రన్ విజయవంతం హంద్రీ– నీవా కాలువ నుంచి చెరువులకు నీటిని మళ్లించేందుకు సెప్టెంబర్ నెలలో డీఈలు రవీంద్రనాథ్‌రెడ్డి, రామకృష్ణ ట్రయల్ రన్ నిర్వహించారు. రెండు మోటార్ల ద్వారా నీటిని పులిచర్ల సమీపంలోని డెలివరీ చాంబర్లోకి వదిలారు. అక్కడి గ్రావిటీ–1 పైపులైన్ ద్వారా కృష్ణగిరి మండలంలోని కటారుకొండ తుమ్మల చెరువు, కర్లకుంట, డోన్ మండలంలోని మల్లెపల్లె, వెంకటాపురం, జగదుర్తి చెరువులకు నీటిని పంపించారు. అలాగే గ్రావిటీ–2 పైప్‌లైన్ ద్వారా ఆలంకొండ గ్రామంలోని బోయినాల, కూర్మగిరి, తుగ్గలి మండలంలోని బొందిమడుగుల, చందోళి, చక్రాళ్ల, ముకెళ్ల చెరువుల్లోకి నీటి విడుదల విజయవంతమైంది. దీంతో ఈ గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం వైఎస్సార్ చలువతో మా గ్రామానికి సమీపంలోనే హంద్రీ–నీవా కాలువ ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో హంద్రీ–నీవా కాలువ నుంచి చెరువులకు నీరు వదిలే పనులు చురుగ్గా సాగుతున్నాయి. బోయినాల, కూర్మగిరి చెరువులకు త్వరలోనే నీరు వదులుతామంటున్నారు. మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం. – ఆర్బీ వెంకటరాముడు, ఆలంకొండ ప్రతి ఏడాది వరి సాగు చేస్తాం హంద్రీ–నీవా కాలువకు మా గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. మా చెరువులకు నీరు వస్తుందనే ఆశ కూడా మాకు లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు చేయిస్తున్నారు. చెరువులకు హంద్రీ–నీవా నీరొస్తే ప్రతి ఏడాది వరిసాగు చేస్తాం. – ఆదినారాయణ, వెంకటాపురం భూగర్భ జలాలు పెరుగుతాయి మా గ్రామ చెరువు ఎప్పుడూ నిండింది లేదు. రెండేళ్ల కిందట ఒకసారి భారీ వర్షానికి నిండింది కానీ పంట సాగుచేస్తే చివరివరకు నీరు చాలలేదు. సెస్టెంబర్లో నిర్వహించిన ట్రయల్ రన్లో మా చెరువులోకి హంద్రీ–నీవా నీరు వచ్చింది. చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే ప్రతి ఏటా వరి పండిస్తాం. బోరుబావుల్లో కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. – జల్ల సుంకన్న, బొందిమడుగుల -
నీటి పైపులైన్ల నుంచి విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: భారీ నీటి పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా విద్యుత్ రంగ నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తరలిస్తున్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఏ మేరకు ఉంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు, ఏవైనా సమస్యలు ఉంటాయా అన్న దిశగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కోదండాపూర్ నుంచి సాహెబ్ నగర్ (గ్రేటర్ శివారు) మార్గంలో 130 కిలోమీటర్ల పొడవునా ఉన్న పైపులైన్లలో నీటి ఒత్తిడి, వేగం ఎక్కువగా ఉన్నచోట టర్బైన్లను ఏర్పాటు చేయాలని.. వాటి నుంచి సుమారు 35 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం ఉండి, టర్బైన్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానించాలని హైదరాబాద్ జల మండలి (వాటర్ బోర్డు) నిర్ణయించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. కరెంటు బిల్లుల భారం తగ్గించుకునేలా? జల మండలి ప్రస్తుతం హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, నగరం నలుమూలలా సరఫరా కోసం సుమారు 200 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. ఇందుకు నెలకు రూ.75కోట్ల మేర బిల్లులు చెల్లిస్తోంది. ఈ భారం తగ్గించుకునేందుకు నీటి పైపులైన్లలో విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా సాంకేతికతను వినియోగి స్తున్నారు. సాగునీళ్లు, తాగునీళ్లతోపాటు పలుచోట్ల సీవరేజీ పైపులైన్లలో కూడా డైనమోలు అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ నీటి పైపులైన్లలో ఏర్పాటు చేయాలని జల మండలి భావిస్తోంది. తొలుత కృష్ణా జలాల పంపింగ్, గ్రావిటీ మెయిన్ పైపులైన్లలో టర్బైన్లు ఏర్పాటు చేసి.. అది సఫలమైతే గోదావరి పైపులైన్లలోనూ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అయితే.. ఈ టర్బైన్ల వల్ల నీటి సరఫరా వేగం తగ్గడం, పంపులు నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తాయా, ఎలాంటి చోట్ల ఏర్పాటు చేయవచ్చు, ఇబ్బందులేమైనా వస్తే ఎలా అధిగమించాలన్న దానిపై అధ్యయనం జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉందని అంటున్నాయి. భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన తరహాలోనే.. పైపులైన్ల నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది. ప్రాజెక్టుల వద్ద చాలా ఎత్తులో ఉండే నీళ్లను పవర్ ప్లాంట్‌లోకి పంపుతారు. అలా దూసుకొచ్చే నీళ్లు భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతూ కిందికి వెళ్లిపోతాయి. ఈ క్రమంలో టర్బైన్లకు అమర్చిన భారీ డైనమోలలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే తరహాలో నీళ్లు వేగంగా దూసుకెళ్లే పైపులైన్లలో అమర్చే హైడ్రోడైనమిక్ టర్బైన్ల నుంచి కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. పైపులైన్లలో మాత్రమే కాకుండా నిరంతరం నీటి ప్రవాహం ఉండే కాల్వల వద్ద కూడా ఇలా కరెంటు ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. ఏమిటీ డైనమో? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాలే డైనమోలు. సింపుల్‌గా చెప్పాలంటే.. మనం ఉపయోగించే ఫ్యాన్లు, నీటి మోటార్ల వంటివే. విద్యుత్ సరఫరా చేసినప్పుడు మోటార్‌కు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్) తిరుగుతుంది. డైనమోలు దీనికి ప్రతిగా (రివర్సులో) పనిచేస్తాయి. డైనమోకు ఉండే ఫ్యాన్ (షాఫ్ట్)ను తిప్పితే.. దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు వేగంగా ప్రవహిస్తున్న నీళ్లు టర్బైన్ను తిప్పుతాయి. దీంతో ఆ టర్బైన్‌కు అనుసంధానం చేసిన డైనమో షాఫ్ట్ కూడా తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. డైనమోలో.. రెండు శక్తివంతమైన అయస్కాంతాలను రెండు వైపులా బిగిస్తారు.. మధ్యలో రాగి,అల్యూమినియం వంటి లోహపు తీగలను చుట్టలుగా చుట్టి ఒక కడ్డీ (షాఫ్ట్) ద్వారా వేలాడదీస్తారు. షాఫ్ట్ను తిప్పినప్పుడు లోహపు చుట్టలు కూడా తిరుగుతాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి లోహపు తీగల్లో విద్యుత్‌ను పుట్టిస్తుంది. -
రూ. 1,700 కోట్లతో ‘సాగర్’ పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి మూలకూ నీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం తదనుగుణంగా కార్యాచరణ శరవేగంగా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గోదావరి జలాలపై ఆధారపడి చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల ద్వారా పూర్వ ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించే ప్రణాళికకు కార్యరూపం ఇస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు రిటైర్డ్ ఇంజనీర్లు సాగర్‌లో భాగంగా ఉండే పాలేరు రిజర్వాయర్ దిగువన, ఎగువన 6.30 లక్షల ఎకరాలకు నీరందించేలా రూ. 1,700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై ఈ వారంలోనే ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎగువ నుంచి రాకున్నా ఢోకా లేదు.. సాగర్ పరిధిలో మొత్తంగా 6.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎగువ నుంచి వచ్చే కృష్ణా జలాలపైనే సాగు ఆధారపడి ఉంటోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి అక్కడి కోయినా డ్యామ్, ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండాకే శ్రీశైలం మీదుగా వరద నీరు సాగర్‌కు చేరుతోంది. అయితే ఏటా ఆగస్టు తర్వాత కానీ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి ప్రవాహాలు ఉండటం లేదు. సాగర్ పూర్తిస్థాయిలో నిండేందుకు సెప్టెంబర్, అక్టోబర్ పడుతోంది. దీంతో సాగర్ కింది ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీరు అందించడం గగనమవుతోంది. ఒకవేళ ఎగువ నుంచి ప్రవాహాలు కరువైతే ఖరీఫ్, రబీలకు నీటి సరఫరా జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు సీజన్లలోనూ సాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించేలా గోదావరి జలాల తరలింపు చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయించారు. సాగర్ ఆయకట్టు పునరుజ్జీవం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని రిటైర్డ్ ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో రిటైర్డ్ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, అనంతరాములు, వెంకట రామారావు తదితరులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి నివేదికరూపొందించారు. మొత్తంగా సీతారామ ఏడు లిఫ్ట్‌ల ద్వారా 72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి పాలేరు రిజర్వాయర్‌కు ఎగువన 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు, పాలేరు నుంచి సాగర్ రిజర్వాయర్‌కు మధ్య 3.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా పునరుజ్జీవ పథకాన్ని డిజైన్ చేశారు. నాగార్జునసాగర్ 21ఎల్ బ్రాంచ్ కెనాల్‌ను ఉపయోగించుకొని దాని పరిధిలోని 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు పాలేరు రిజర్వాయర్ వరకు గల 2.50 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టును స్థిరీకరించడానికి 80 కి.మీ. నుంచి 104 కి.మీ. లింక్ కెనాల్ తవ్వాలని, దానికి 21ఎల్ బ్రాంచ్ కెనాల్‌ను కలపాలని సూచించారు. మొత్తంగా సాగర్ కాలువపై ఆరు లిఫ్టులు, మున్నేరు వద్ద నిర్మించబోయే బ్యారేజీ వద్ద ఒక లిఫ్ట్‌తో కలిపి మొత్తం ఏడు దశల్లో నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ఇందులో పంప్‌హౌస్‌ల ఎలక్ట్రో మెకానికల్ వర్క్‌లకు రూ. 725 కోట్లు, సివిల్ పనులకు రూ. 980 కోట్లు, ఇతర పనులకు రూ. 265 కోట్లు, నాన్ కాంట్రాక్ట్ ఐటమ్స్‌కు రూ. 250 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ. 2,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా ఇప్పటికే సీతారామ కింద చేపట్టిన నిర్మాణాలను మినహాయించడంతో రూ. 1,700 కోట్ల అంచనా వ్యయం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు తేల్చారు. -
28,29 తేదీల్లో నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా తాగునీటిపైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడంతో ఈనెల 28, 29 తేదీల్లో పలుప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. బండ్లగూడ వద్ద కృష్ణా ఫేజ్–1కు సంబంధించి 2200 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ తాగునీటి పైపులైన్‌కు భారీ లీకేజీ ఏర్పడడంతో రెండురోజుల పాటు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఈనెల 28 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి 29 (గురువారం) సాయంత్రం 6గంటల వరకు మొత్తం36 గంటలపాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. 28న మంచినీటి సరఫరానిలిచిపోయే ప్రాంతాలివే.. అలియాబాద్, మిరాలాం, కిషన్‌బాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్,వినయ్ నగర్, సైదాబాద్, ఆస్మాన్ ఘడ్, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట్, మూసారాంబాగ్, బొగ్గులకుంట,అఫ్జల్‌గంజ్, హిందీనగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం, చిలకలగూడ, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు. ఈనెల 29న నీళ్లు బంద్ ఇక్కడే.. భోజగుట్ట, మారేడ్ పల్లి, సైనిక్ పురి పరిసర ప్రాంతాలు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం శాంతించగా కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన వరద జలాల్లో 7,800 క్యూసెక్కులను డెల్టా కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 10,45,848 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. బుధవారం వరద మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 2,10,312 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 82,661 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 868.6 అడుగుల్లో 135.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా నదీ జన్మస్థానమైన మహాబలేశ్వరం పర్వతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల మేరకు ఈ రెండు జలాశయాల నుంచి మంగళవారం సాయంత్రం నీటి విడుదలను నాలుగు లక్షల క్యూసెక్కులకు పెంచారు. బీమా నదిపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు జూరాల ప్రాజెక్టు మీదుగా శ్రీశైలాన్ని చేరనున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం, ఆ తర్వాత వారం రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండుతాయి. తుంగభద్రలో సోమవారంతో పోల్చితే.. మంగళవారం వరద ప్రవాహం కాస్త పెరిగింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించారు. మంగళవారం ఉదయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 0.226 మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రంలో 15.703 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. నేడు తీరం దాటనున్న వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాసోర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తుపానుగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సహాయ చర్యలు ముమ్మరం తూర్పుగోదావరిలో వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. ముంపునకు గురైన గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తూర్పు గోదావరి జిల్లాలో 18,809 మందికి 85 సహాయ, పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించింది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 85 వైద్య శిబిరాలను నిర్వహించింది. ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 1,377.5 క్వింటాళ్ల బియ్యం, 10,100 లీటర్ల కిరోసిన్, 5,240 కిలోల కందిపప్పు, 6,967 లీటర్ల పామాయిల్, 6,967 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 420 గ్రామాల ప్రజలు వరదలబారిన పడ్డారు. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో తూర్పుగోదావరి జిల్లాలో 64, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కలిపి మొత్తం 112 గ్రామాలకు రవాణా సదుపాయాలు లేకుండా పోయాయి. 17,737 ఇళ్లు గత 24 గంటలుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్ మంగళవారం వరద బాధితులను పరామర్శించారు. వచ్చే ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. -
బిరబిరా కృష్ణమ్మ.. గలగలా గోదావరి
సాక్షి, అమరావతి/కర్నూలు సిటీ/పోలవరం రూరల్/ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాలు, పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఉప నదుల నుంచి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు నిండిపోవడంతో అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు 1.94 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీరు తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటోంది. జూరాలలో బుధవారం సాయంత్రం 5 గంటలకు 24 గేట్లు పైకెత్తి 1,85,116 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు 187 కిలోమీటర్ల మేర ప్రవహించి గురువారం ఉదయానికి శ్రీశైలం జలాశయానికి చేరుకునే అవకాశం ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 804 అడుగుల నీటి మట్టంతో 31.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దాదాపు 11 నెలల తరువాత శ్రీశైలానికి కృష్ణా జలాలు రానున్నాయి. గురువారం ఉదయం 6 గంటలకు 1,62,444 క్యూసెక్కుల నీరు మల్లన్న చెంతకు చేరుకోనున్నట్లు సీడబ్ల్యూసీ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని నదీ తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం నుంచి దిగువకు విడుదలవుతున్న గోదావరి వరద నీరు వంశధారలో తగ్గిన ప్రవాహం తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం 14,613 క్యూసెక్కులు తుంగభద్ర(టీబీ) డ్యామ్‌లోకి చేరడంతో నీటి నిల్వ 26.69 టీఎంసీలకు చేరుకుంది. బీమా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉజ్జయిని డ్యామ్‌లోకి 58,450 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 67.65 టీఎంసీలకు చేరుకుంది. టీబీ డ్యామ్, ఉజ్జయిని డ్యామ్ నిండితే తుంగభద్ర, భీమా నదుల ప్రవాహం కృష్ణాలో నదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. వంశధారలో వరద ప్రవాహం ఒకింత తగ్గింది. గొట్టా బ్యారేజీలోకి 4,419 క్యూసెక్కులు రాగా, అదేస్థాయిలో వరద నీటిని సముద్రంలోకి వదిలారు. పోటెత్తుతున్న వరద గోదావరి గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు తదితర ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా గోదావరిలో చేరుతోంది. గోదావరిలో పోలవరం కాఫర్‌డ్యామ్ చుట్టూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో వరద గంట గంటకూ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం 5.50 లక్షల క్యూసెక్కులు ఉండగా.. సాయంత్రం 6 గంటలకు 7 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 27.20 మీటర్లకు చేరింది. పోలవరం వద్ద వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరితే, స్పిల్ వే మీదుగా వరద నీటిని మళ్లించాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సూచించింది. ఆ మేరకు స్పిల్‌వే రివర్ స్లూయిజ్‌లను తెరిచిన అధికారులు వరదను స్పిల్ చానల్ మీదుగా గోదావరిలోకి మళ్లిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రక్షణ చర్యలు చేపడతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీరు ఒకేరోజు 65 టీఎంసీలు కడలిలోకి.. గోదావరి వరద ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా చేరుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 3,18,227 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. సాయంత్రం 6 గంటలకు 6,96,362 కూసెక్కులకు చేరుకుంది. కాలువలకు 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 174 గేట్లను ఎత్తిన అధికారులు 6,87,362 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ అంటే 24 గంటల్లో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 65 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 180 టీఎంసీలు కడలిలో కలిసిపోయాయి. -
రూ.2,200 కోట్లతో ‘గట్టు’ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాలను వినియోగించుకుంటూ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకాన్ని విస్తరించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జూరాల నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని తీసుకుంటూ 30 రోజుల్లో కనీసంగా 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా దీన్ని రూపొందిస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన 4 టీఎంసీల రిజర్వాయర్‌కు బదులుగా 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో పెంచికలపాడు రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికి రూ.2,500 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు గత ఏడాది జూన్‌లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. తదనంతరం దీనిపై సమీక్షించిన సీఎం రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల నుంచే నీటిని తీసుకోవాలని, రిజర్వాయర్ సామ ర్థ్యాన్ని సైతం పెంచాలని, ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణం గా సర్వే చేసిన అధికారులు జూరాల నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. నీటి నిల్వకోసం 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదిస్తుండగా, దీనికోసం 3,500 ఎకరాల భూసేకరణ అవసరమని గుర్తించారు. 160 మీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేయనున్నారు. దీనికోసం రూ.2,500 కోట్లు వ్యయం అవుతందని అంచనా వేశారు. దీనిపై సమ గ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. -
రోడ్డు చెరువైంది!
నాగోలు వద్ద పగిలిన పైపులైన్ హైదరాబాద్: కృష్ణా వాటర్ పైపులైన్ పగలడంతో నీరంతా వృథాగా పోయింది. బీఎన్‌రెడ్డి నగర్ నుంచి సైనిక్‌పురి, ఉప్పల్ వెళ్లే వెయ్యి ఎం.ఎం.ల పైపులైన్ నాగోలు సమీపంలోని మమతానగర్ రోడ్ నం. 2 వద్ద గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పగలడంతో నీరంతా రోడ్డుపాలైంది. పక్కనే ఉన్న శ్రీభవాని ఎంటర్ప్రైజెస్ గోదాములో నీరంతా చేరడంతో హార్డ్‌వేర్ పరికరాలు, మూడు ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న జలమండలి ఆపరేషన్ డెరైక్టర్ రామేశ్వరరావు, జీఎం రాజు, డీజీఎం శ్రీనివాస్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంచినీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపడతామని తెలిపారు. మంచినీటి పైపులైన్ పగిలి నీరు ఒక్కసారిగా పైకి లేచి రోడ్డుమీదికి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. -
పైప్‌లైన్ పగిలి ఇళ్ళలోకి చేరిన నీరు