
రోడ్డు చెరువైంది!
నాగోలు వద్ద పగిలిన పైపులైన్
హైదరాబాద్: కృష్ణా వాటర్ పైపులైన్ పగలడంతో నీరంతా వృథాగా పోయింది. బీఎన్‌రెడ్డి నగర్ నుంచి సైనిక్‌పురి, ఉప్పల్ వెళ్లే వెయ్యి ఎం.ఎం.ల పైపులైన్ నాగోలు సమీపంలోని మమతానగర్ రోడ్ నం. 2 వద్ద గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పగలడంతో నీరంతా రోడ్డుపాలైంది. పక్కనే ఉన్న శ్రీభవాని ఎంటర్‌ప్రైజెస్ గోదాములో నీరంతా చేరడంతో హార్డ్‌వేర్ పరికరాలు, మూడు ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న జలమండలి ఆపరేషన్ డెరైక్టర్ రామేశ్వరరావు, జీఎం రాజు, డీజీఎం శ్రీనివాస్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంచినీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపడతామని తెలిపారు. మంచినీటి పైపులైన్ పగిలి నీరు ఒక్కసారిగా పైకి లేచి రోడ్డుమీదికి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.