Chittoor Assembly Constituency
-
రీల్స్ రాజా.. గురజాల
ప్రజల కష్టం తెలిసిన వారు.. పేదల స్వేదం విలువ తెలిసిన వారు.. జవాబుదారీతనంలో బాధ్యతలు నిర్వర్తించేవారు తమ ప్రతినిధిగా చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. అయితే డబ్బుంటే చాలు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి మరే అర్హత అవసరం లేదని చంద్రబాబు మరోమారు నిరూపించారు. పార్టీ కోసం త్యాగాలను చేసిన వారు.. ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడిన వాళ్లు.. ఏళ్ల తరబడి జెండాలు మోసిన నేతలను గాలికి వదిలేశారు. రూ.కోట్లకు పడగలెత్తడమే ప్రధాన అర్హతగా భావించి.. బెంగళూరు నుంచి ఊడిపడిన గురజాల జగన్మోహన్నాయుడుని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు కనీస పరిచయం లేని వ్యక్తిని స్థానిక నేతల నెత్తినపెట్టారు. తీరా ఆయన వ్యవహారశైలి చూస్తే విలువలకు తిలోదకాలిచ్చినట్టే కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న సదరు అభ్యర్థి వీడియోలు.. రీల్స్ చూసిన టీడీపీ నేతలు సైతం ఇదెక్కడి విపరీతం అంటూ తలలు పట్టుకుంటున్నారు. చిత్తూరు అర్బన్ : టీడీపీ చిత్తూరు ఎమ్మెల్య అభ్యర్థి గురజాల జగన్మోహన్నాయుడు (జీజేఎం) ప్రచారానికి వెళితే రూ.కోట్ల విలువ చేసే వాహనాల శ్రేణి, ఖరీదైన వ్యక్తులు తప్ప సామాన్యులు కనిపించరు. జీజేఎం రోజుకు పట్టుమని అయిదు కిలో మీటర్లు కూడా నడిచి తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన జీవన శైలి మొత్తం విలాసవంతంగా కనినపిస్తుంది. కష్టపడి పనిచేసే పేదల బతుకు పోరాటంపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. అలాంటిది చిత్తూరు నియోజకవర్గంలో ప్రజల మనన్నలు పొందడం జీజేఎంకు చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా సొంత పార్టీలోని సీనియర్లకు సైతం ఆయన వ్యవహారశైలి నచ్చడంలేదనే విమర్శలున్నాయి. ఇటీవల పార్టీలోకి వచ్చిన ఓ సీనియర్ నాయకుడి అనుచరులు తన ప్రత్యర్థతో మాట్లాడుతున్నారా...? అని ఆరా తీయడం వాళ్లకు తెలిసి పోయి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పారీ్టలో కురువృద్ధుడిగా ఉన్న వ్యక్తిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోవడం ఖాయమని, అందుకే తన ప్రణాళికలు తనకు ఉన్నట్లు సన్నిహితులతో చెప్పుకుంటున్నట్లు టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఇక టికెట్ రాకపోవడంతో నిస్తేజంలో ఉన్న టీడీపీలోని కాపు నాయకులను అస్సలు నమ్మడంలేదని, వీళ్ల వల్ల తనకు వంద ఓట్లు కూడా పడవని జీజేఎం ఓ యువ నేత వద్ద అన్నట్లు తెలుస్తోంది. తాను కేవలం క్షేత్రస్థాయిలో ఓటర్లను నమ్ముతానే తప్ప, వెన్నంటే ఉంటూ తనపై బురదజల్లేవారిని నమ్మడంలేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. 20 ఏళ్లల్లో ఎపుడూ చిత్తూరులో కనిపించని వ్యక్తి, రేపు ఎన్నికల్లో ఓడిపోతే, బెంగళూరుకు వెళ్లిపోకుండా స్థానికంగా అందుబాటులో ఉంటారని ఎలా నమ్మగలమని సామాన్య కార్యకర్తలు అనుమానిస్తున్నారు. అడ్డదిడ్డంగా వీడియోలు..! సామాజిక మాధ్యమాల్లో జీజేఎం చేసిన రీల్స్, వీడియోలను చూస్తుంటే కొందరు నవ్వుకుంటుంటే, మరికొందరు అసహ్యించుకుంటున్నారు. ఇటీవల వైరల్‌గా మారిన ఆయన వీడియోలు చూసిన ప్రజలు ఇదెక్కడి వేషాలు బాబోయ్ అని మండిపడుతున్నారు. వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. ► బైకు నడిపేటపుడు హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినా ప్రాణహాని ఉండదు. పైగా వేగంగా బైకును పోనిచ్చి, రెండు చేతులు వదిలేస్తూ స్టంట్లు చేస్తే..? కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. పైగా ప్రభుత్వ రహదారులపై ఇలాంటివి చేసేపుడు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నది నిబంధన. కానీ చిత్తూరు టీడీపీ అభ్యర్థి ఈ నిబంధనలను తుంగలో తొక్కి బైకు వేగంగా నడుపుతూ, రెండు చేతులు వదిలేసి స్టంట్లు చేసే వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం విమర్శలకు దారితీసింది. ► మరొక వీడియోలో మహిళలతో కలిసి జీజేఎం రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తూ యువతకు ఏం సందేశమిస్తున్నారని చిత్తూరు వాసులు ప్రశి్నస్తున్నారు. ► ఇంకొక వీడియోలో తనకు అంగరక్షులు ఉన్నారనే అర్థం వచ్చేలా ఇద్దరు వ్యక్తులకు పొడవాటి తుపాకులు ఇచ్చి వాటిని కూడా వీడియో తీసి పెట్టాడు. ఈ వీడియో ఎక్కడ తీశారో..? అసలు అందులో కనిపిస్తున్న అంగరక్షకుల వద్ద ఉన్న తుపాకులకు లైసెన్స్ ఉందా.? కాల పరిమితి అయిపోయిందా..? అనే వివరాలు తెలియడంలేదు. దీని ద్వారా తానో డాన్‌గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ► ఇటీవల చిత్తూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావుతో కలిసి ప్రచారానికి జీజేఎం వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో మాట్లాడారు. తాను ఎక్కడికి వెళ్లినా నీళ్లు లేవు, రోడ్లులేవు అంటున్నారని, ఇక్కడ నేను కాదు కదా ఉండేది.. ఇచ్చేది అని దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ కావడంతో చిత్తూరు వాసులు ఈయనకు ఓటేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
కుప్పంలో చంద్రబాబుకు గుణపాఠం తప్పదా?
ఏడుసార్లు అందలం ఎక్కించిన కుప్పం ప్రజలు ఈసారి ఓడించి హైదరాబాద్‌కే పరిమితం చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారా? ఓటమి భయంతోనే కుప్పంతో పాటు మరో నియోజకవర్గం కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారా? 35 ఏళ్ళపాటు ఏకధాటిగా ఎన్నుకున్నా పట్టించుకోనందుకు కుప్పం ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారా? కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందన్న భయంతోనే బలమైన సీటు కోసం వేట ప్రారంభించారా? అసలు కుప్పంలో ఏం జరుగుతోంది? 1983 ఎన్నికల్లో తన సొంత నియోజక వర్గం చంద్రగిరిలో ఘోర పరాజయం పొందిన చంద్రబాబు నాయుడు.. 1989 ఎన్నికల నాటికి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇపుడు ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారా అంటూ కామెడీ చేస్తోన్న చంద్రబాబు మూడున్నర దశాబ్ధాల క్రితమే చంద్రగిరి నుంచి కుప్పం నియోజక వర్గానికి బదలీ అయిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన నియోజక వర్గంగా కుప్పాన్ని మూడున్నర దశాబ్ధాల పాటు చంద్రబాబు తన స్వప్రయోజనాలకే వాడుకున్నారు. 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయినా కుప్పం నియోజక వర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అందుకే కుప్పం ప్రజలు ఉపాధిలేక ఉస్సూరు మంటూ ఉండేవారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం లో సంక్షేమ పథకాల అమలుతో దాని ముఖచిత్రం మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల్లోనే అధికారం ఉన్నప్పుడు ఆయన కుప్పానికి ఏమీ చేయలేదు. కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయలేదు. రెవిన్యూ డివిజన్‌గా చేసుకోలేకపోయారు. హంద్రీ నీవా నీళ్లు కుప్పం వరకు తేలేకపోయారు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుప్పం నియోజక వర్గం తలరాత మారిందని చెప్పాలి. ముందుగా మున్సిపాలిటీని చేశారు. ఆ వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు. కుప్పం కాలువలకు హంద్రీ నీవా ద్వారా నీటిని అందించే బృహత్ పథకం కూడా సాకారం చేశారు జగన్మోహన్రెడ్డి. ఫలితంగా నియోజక వర్గంలోని 44 కాలువలు జలకళతో మెరవనున్నాయి. ఇక నవరత్న పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్నారు జగన్మోహన్రెడ్డి. ఈ మార్పు కారణంగానే కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపారు. పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ అభ్యర్ధులను గెలిపించారు కుప్పం ప్రజలు. ఈ వరుస ఓటముల కారణంగానే చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. అంత వరకు కుప్పానికి చుట్టపు చూపుగా కూడా రాని చంద్రబాబు ఏడాదిలో మూడు సార్లు కుప్పం వచ్చి రెండు మూడు రోజులు గడిపి వెళ్తున్నారు. ఇంత వరకు కుప్పంలో ఇల్లుకూడా కట్టుకోని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయాల తర్వాతనే నియోజక వర్గంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. కేవలం ఎన్నికల్లో ఓట్లకోసమే చంద్రబాబు ఇలా డ్రామాలు చేస్తున్నారని నియోజక వర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలోనూ వైఎస్సార్సీపీజెండా ఎగరేస్తామని పాలక పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. కుప్పాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వై నాట్ 175 అన్ని నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు కుప్పం నియోజక వర్గంలో ఎన్ని అక్రమాలు జరిగినా దొంగ ఓట్ల వ్యవహారాలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్రెడ్డి అన్నీ పకడ్బందీగా చూస్తూ ఉండడంతో చంద్రబాబుకు కస్టాలు తప్పేలా లేవంటున్నారు మేథావులు. కుప్పం ప్రజలపై కానీ.. కుప్పంలోని టిడిపి నాయకులపై కానీ చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకే నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. దీనిపైనా టిడిపి శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడినా ఓడిపోవచ్చని గ్రహించిన చంద్రబాబు ఎన్టీయార్ కృష్ణా జిల్లాలో ఏదైనా బలమైన నియోజక వర్గం నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబులో భయం అయితే తీవ్ర స్థాయిలో ఉందన్నది భయంకర వాస్తవం. -
అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది!
యూజ్ అండ్ త్రో పాలసీకి పేటెంట్‌దారుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. జిల్లా ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా డబ్బు సంచులు తెచ్చేవారికే టిక్కెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే వ్యవహారం చిత్తూరు నియోజకవర్గంలో కాక రేపుతోంది. కష్టకాలంలో పార్టీకోసం పనిచేసినవారిని కాదని.. డబ్బులిస్తారని ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే సహించేది లేదని అక్కడి నేతలు తేల్చి చెబుతున్నారు. కొత్తవారికి ఇస్తే మరోసారి ఓటమి ఖాయమని అధినేతకు తెగేసి చెప్పేస్తున్నారు. అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపిలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. స్థానిక నేతలకు బదులుగా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తుండడం టిడిపి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా చిత్తూరులో టిడిపి వ్యవహారాలను కాజూరు బాలాజీ చూస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనే టాక్ నడుస్తోంది. బాలాజీ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వాన్ని మొదట టిడిపి అధిష్టాన వర్గం పరిశీలించిందట. అయితే ఇప్పుడు కొత్తగా టీఎన్ రాజన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. గురజాల జగన్మోహన్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. కొద్ది నెలలుగా చిత్తూరులో పర్యటిస్తూ అసెంబ్లీ టిక్కెట్ తనకే వస్తుందని అనుచర గణం వద్ద చెప్పుకుంటున్నారట. అలాగే తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ టిఎన్ రాజన్ రెండు మూడు వారాలుగా చిత్తూరుకు వచ్చి తనకే టికెట్ వస్తుందని తన సామాజిక వర్గం వద్ద గట్టిగా చెబుతున్నాడట. చిత్తూరు అభ్యర్థిగా రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ కేడర్‌లో అయోమయం ఏర్పడింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటివరకు చిత్తూరు విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదు..ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడంలేదట. దీంతో ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ అగ్ర నాయకత్వమే అభ్యర్థి విషయంలో గందరగోళానికి తావిస్తోందని, ఎలాగూ ఓడిపోయే సీటే గనుక పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడంలేదేమో అని కూడా కార్యకర్తలు సందేహిస్తున్నారు. టికెట్ విషయంలో ఎవరో ఒకరు తేల్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీడీపీతో పొత్తు కోసం ఆ నలుగురు నేతలు పాట్లు..! -
కాంగ్రెస్‌లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని అన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు ఉన్నా ప్రత్యర్థిగానే చూస్తామని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అవుతానని చంద్రబాబు ఇంకా పగటి కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మరోసారి సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. సీఎం జగన్ మా నాయకుడు. ఆయన కోసం మేము ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాం. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఎన్ని వచ్చినా మేము ముఖ్యమంత్రి జగన్‌తోనే నడుస్తాం. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం కాంగ్రెస్, టీడీపీ పార్టీలదే. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా.. ఎవరు చేరినా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. మేము వారిని ప్రత్యర్థులుగానే చూస్తాం. జడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు. ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరుకుంటున్నా అని కామెంట్స్ చేశారు.