‘చంద్రబాబూ.. రాళ్లు వేయించుకుంటే ఓట్లు పడవు’ | AP Minster Peddireddy Slams Chandrababu Stone Politics | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. రాళ్లు వేయించుకుంటే సింపథీ రాదు.. ఓట్లు పడవు’

Published Mon, Apr 15 2024 9:09 AM | Last Updated on Mon, Apr 15 2024 12:59 PM

AP Minster Peddireddy Slams Chandrababu Stone Politics - Sakshi

తిరుపతి, సాక్షి:  సీఎం జగన్‌పై దాడి కేసులో చంద్రబాబు, లోకేష్‌ నీచంగా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జనాల్లో సీఎం జగన్‌పై సింపథీ ఎక్కడ పెరిగిపోతుందో అనే ఆందోళన టీడీపీలో మొదలైందని.. కానీ, సింపథీతో జనాలు ఓట్లేయరని విషయం అనుభవపూర్వకంగా చంద్రబాబుకు తెలుసంటూ చురకలంటించారాయన. 

తిరుపతిలో సోమవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు తన మీద రాళ్లు వేయించుకుని సింపథీతో గెలుద్దామని అనుకుంటున్నారు. కానీ, సింపథీతో ఓట్లు రావనే విషయం ఆయనకు తెలుసు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశారు. చంద్రబాబు పై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజలు చిత్తుగా ఓడించారు.  ఆ గతాన్ని బాబు గుర్తు తెచ్చుకోవాలి. 

ఇదీ చదవండి: మాటు వేసి.. మట్టుబెట్టే కుట్ర

..రాళ్ల దాడిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి  కంటికి గాయం అయ్యింది. కానీ, చంద్రబాబుకు ఇవేం కనిపించడం లేదా?. అయినా కూడా నాపై రాళ్ళ దాడి జరిగింది అంటూ చంద్రబాబు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అసలు చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడటం లేదు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి. కానీ, చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టండి అంటూ చంద్రబాబే పిలుపు ఇచ్చారు. చంద్రబాబు దగ్గర మంచి పేరు కోసం టీడీపీ వాళ్లే సీఎం జగన్‌పైకి రాళ్లు విసిరాయి. చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయాల్ని ఏపీ ప్రజలంతా గమనిస్తున్నారు. 

.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందిస్తూ అండగా ఉంటే.. ప్రజలు నేతలపై నమ్మకం ఉంచుతారు. అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటనను ఇప్పుడు ప్రజలంతా ఖండిస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే కనీసం పరామర్శకు రావాల్సింది పోయి చంద్రబాబు ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement