
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో ప్రజాదరణను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేశారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నారా లోకేష్ వ్యాఖ్యలను గమినిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోంది అంటూ విమర్శలు చేశారు.
కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి అందరూ నైరాశ్యంలో ఉన్నారు. సీఎం జగన్‌కు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. ట్విట్టర్‌లో నారా లోకేష్ 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతోంది.
ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా?. అదే రాయిని లోకేష్‌కు ఇస్తాం. అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా కొట్టించాలి. అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యమవుతుందో లేదో తెలుస్తుంది. ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. గతంలో పాదయాత్రకు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోంది అన్నారు. కృష్ణా జిల్లా ఇంచార్జీగా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశాం. మళ్ళీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో ఈ కుట్రకు తెర లేపారు’ అని విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment