
సాక్షి, తిరుపతి: చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో మాత్రమే అరెస్టు అక్రమమంటున్నారని విపక్షాలపై మండిపడ్డారు. అవినీతి కేసులో చంద్రబాబు ఇన్నాళ్లు స్టేలతో కాలం గడిపారని. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి నిరసన రాలేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. టీడీపీ బంద్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ కూడా నడుస్తోందని అన్నారు. స్కిల్‌స్కాం కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు. చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉన్నాయని అన్నారు. పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు.
చంద్రబాబు దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందని రామచంద్రా రెడ్డి అన్నారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని చెప్పారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించడం దారుణం అని అన్నారు.
ఇదీ చదవండి: పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌తోనే కేసు నడవలేదు.. స్కిల్ కేసును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయ్: ఏపీ సీఐడీ
Comments
Please login to add a commentAdd a comment